తెలంగాణ

telangana

ETV Bharat / sports

'టీమ్ఇండియా తరఫున అత్యధిక వికెట్లు నా కల'

టీమ్ఇండియా తరఫున అత్యధిక వికెట్లు సాధించాలన్నదే తన కల అని అంటున్నాడు పేసర్ మహ్మద్ సిరాజ్. అందుకోసం చాలా శ్రమిస్తున్నానని తెలిపాడు.

Siraj
సిరాజ్

By

Published : Apr 8, 2021, 10:47 AM IST

ఆస్ట్రేలియా పర్యటనలో సత్తాచాటి గుర్తింపు తెచ్చుకున్నాడు టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్. ప్రస్తుతం ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడుతున్న ఇతడు ప్రాక్టీస్​లో మునిగిపోయాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో 'మీ లక్ష్యమేంటి?' అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పాడు.

"నేను బౌలింగ్ చేస్తున్నపుడు బుమ్రా నాకు మద్దతుగా నిలిచేవాడు. నీవు ఎలా వేయగలవో అలాగే వేయమని.. అదనంగా ఏమీ చేయొద్దని చెప్పేవాడు. అంతటి అనుభవం గల బౌలర్​ నుంచి నేర్చుకోవడం గొప్పగా అనిపిస్తుంది. నేను ఇషాంత్ శర్మతో కూడా ఆడాను. అతడు 100 టెస్టులు ఆడాడు. అతడితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం సంతోషం. టీమ్ఇండియా తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్​గా నిలవాలన్నదే నా కల."

-సిరాజ్, టీమ్ఇండియా బౌలర్

ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు అరంగేట్రం చేసిన సిరాజ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. గబ్బా టెస్టులో ఐదు వికెట్లు తీసి టీమ్ఇండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ఈ పర్యటన సమయంలోనే తన తండ్రిని కోల్పోయాడీ బౌలర్. కానీ జట్టు కోసం అక్కడే ఉండిపోయాడు. ఈ విషయంపైనా స్పందించాడు సిరాజ్.

"ఆస్ట్రేలియా పర్యటనలో క్వారంటైన్​లో ఉన్న సమయంలో తండ్రి చనిపోయారన్న వార్త వచ్చింది. దురదృష్టవశాత్తు ఆ సమయంలో నా గదికి ఎవరూ రాలేదు. నేను మా అమ్మ, ప్రేయసికి ఫోన్ చేశా. ఆ సమయంలో మా అమ్మ నాకు చాలా మద్దతుగా నిలిచారు. 'తండ్రి కల నెరవేర్చే బాధ్యత నీకుంది' అని చెప్పారు" అంటూ వెల్లడించాడు సిరాజ్.

ABOUT THE AUTHOR

...view details