ఐపీఎల్ కొన్నిరోజుల్లో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రాక్టీసులో ఉన్న చెన్నై సూపర్‌కింగ్స్, సురేశ్ రైనా స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలా అని ఆలోచిస్తుంది. యువ క్రికెటర్లు లేదంటే సీనియర్లతో చేయాలా అని తర్జనభర్జన పడుతోంది. టీ20ల్లో ఇటీవలే అగ్రస్థానం దక్కించుకున్న ఇంగ్లాండ్ క్రికెటర్ డేవిడ్ మలన్‌పై ఇప్పుడు కన్నేసినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో స్పష్టత రానుంది.
ఈ మధ్య జరిగిన ఆస్ట్రేలియా, పాకిస్థాన్ సిరీస్‌ల్లో పరుగుల వరద పారించిన మలన్.. టీ20 బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్ నాలుగు స్థానాలు ఎగబాకి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఒకవేళ ఐపీఎల్‌కు ఇతడు ఎంపికైతే అదే ఊపు, టోర్నీలో కొనసాగించే అవకాశముంది. రైనాలాగే ఎడమ చేతివాటం బ్యాట్స్‌మన్ కావడం, మూడో స్థానంలో ఆడటం ఇతడికి కలిసొచ్చే అంశాలు.