తెలంగాణ

telangana

By

Published : Nov 11, 2019, 4:59 AM IST

ETV Bharat / sports

బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ కాలపరిమితి పెరుగుతుందా?

సౌరభ్​ గంగూలీ అధ్యక్షతన బీసీసీఐ వార్షిక సమావేశం.. వచ్చే నెల 1న జరగనుంది. బీసీసీఐ అధ్యక్షుడి పదవీకాలంపై ఉన్న నియమాల్లో కీలక సవరణలు చేసే అవకాశముంది. ఇదే జరిగితే... ప్రస్తుతమున్న సౌరభ్​ వదవీకాలం (9నెలల) మరింత పెరగనుంది.

బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ కాలపరిమితి పెరుగుతుందా?

మూడేళ్ల తర్వాత తొలిసారి భారత క్రికెట్ నియంత్రణ మండలి సాధారణ వార్షిక సమావేశం (ఏజీఎమ్​) జరగనుంది. నూతన అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ నాయకత్వంలో డిసెంబరు 1న ముంబయిలో బీసీసీఐ అధికారులు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో కొన్ని కీలక సవరణలు చేసే ఆలోచనలో ఉన్నారు.

ప్రస్తుత నియమాల ప్రకారం నూతన అధ్యక్షుడిగా గంగూలీ.. బీసీసీఐ అధ్యక్ష పదవిని 9 నెలలే నిర్వహిస్తాడు. అయితే ఏజీఎమ్​లో సౌరభ్ కాలపరిమితిని పెంచేందుకు బీసీసీఐ రాజ్యంగాన్ని సవరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా బీసీసీఐ సభ్యుడి కాలపరిమితి ఆరేళ్లు ఉంటుంది. మరోసారి చేయాలంటే ముడేళ్లు విరామం ఉండాలనే నిబంధన ఉంది. దీనిని తొలగించనున్నట్లు సమాచారం.

"బీసీసీఐకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాం. లోధా కమిటీ చేసిన సంస్కరణలు పర్యవేక్షించి అనవసరమైన వాటిని రద్దు చేసేందుకు సుప్రీం కోర్టులో అప్పీలు చేస్తాం" - బీసీసీఐ ప్రతినిధి.

వీటితో పాటు మరికొన్ని సవరణలు జరిగే అవకాశముందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

ఇదీ చదవండి: దేవుడా.. ఉన్నావా.. అసలు ఉన్నావా: నీషమ్​

ABOUT THE AUTHOR

...view details