ఆస్ట్రేలియాలో బాక్సింగ్ డే టెస్టును మెల్బోర్న్లో నిర్వహించడం ఆనవాయితీ. అయితే ఈ ఏడాది భారత్తో సిరీస్లో భాగంగా బాక్సింగ్ డే టెస్టుకు అడిలైడ్ ఆతిథ్యం ఇచ్చే అవకాశముందని వార్తలు వచ్చాయి. వీటిపై స్పందించిన ఆస్ట్రేలియా బోర్డు.. ఆ మ్యాచ్ వేదికపై నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం ఉందని తెలిపింది. టెస్టు జరిగే సమయానికి పరిస్థితులు చక్కబడతాయని ఆశాభావం వ్యక్తం చేసింది.
"ప్రస్తుతం చాలా ఆంక్షలు ఉన్నాయి. అయితే ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడతాం. ప్రజలు కూడా బయటకు వస్తారు. లైవ్ ఈవెంట్లు నిర్వహిస్తాం. బాక్సింగ్ డే టెస్టు నాటికి సాధారణ పరిస్థితులు వస్తాయని అనుకుంటున్నాం. అదే జరిగితే మెల్బోర్న్లోనే బాక్సింగ్ డే మ్యాచ్ జరుగుతుంది"