తెలంగాణ

telangana

ETV Bharat / sports

క్రికెటర్ ఆర్చర్​పై వర్ణ వివక్ష​.. కివీస్ బోర్డు క్షమాపణలు

న్యూజిలాండ్​తో జరిగిన టెస్టులో ఇంగ్లాండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ అవమానానికి గురయ్యాడట. ఈ విషయాన్ని అతడే స్వయంగా ట్విట్టర్లో పంచుకున్నాడు. ఈ అంశంపై స్పందించిన కివీస్ క్రికెట్ బోర్డు.. ఆర్చర్​ను క్షమాపణలు కోరింది.

జోఫ్రా ఆర్చర్

By

Published : Nov 25, 2019, 7:36 PM IST

ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ వర్ణ వివక్ష ఎదుర్కొన్నాడట. ఈ విషయాన్ని అతడు స్వయంగా చెప్పాడు. బే ఓవల్ వేదికగా న్యూజిలాండ్​తో జరిగిన టెస్టులో ఓ వ్యక్తి తనను అవమానించేలా మాట్లాడాడని ట్వీట్ చేశాడు.

"ఈ రోజు నేను బ్యాటింగ్​కు వచ్చేటప్పుడు అవమానానికి గురయ్యాను. నా రంగు గురించి మాట్లాడుతూ ఓ వ్యక్తి నేను బాధపడేలా చేశాడు. అతడు మినహా మిగతా వారంతా మాకు చక్కటి మద్దతునిచ్చారు" - జోఫ్రా ఆర్చర్, ఇంగ్లాండ్ బౌలర్.

ఈ అంశంపై న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు స్పందించింది. బాధ్యుడిపై చర్యలు తీసుకుంటామని తమ వంతుగా ఆర్చర్​ను క్షమాపణలు కోరింది.

"ఎవరైతే జోఫ్రా ఆర్చర్​ను అవమానించేలా మాట్లాడాడో అతడిని భద్రతా సిబ్బంది గుర్తించలేకపోయింది. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నాం. బాధ్యుడిని గుర్తించి చర్యలు చేపడతాం. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదు. ఇకపై క్రికెట్ వేదికల్లో అవమానకరంగా మాట్లాడినా, పరుష పదజాలంతో దూషించినా పోలీసులు రంగంలో దిగేలా చర్యలు తీసుకుంటాం. అనుకోని పరిస్థితుల్లో ఆర్చర్​కు జరిగిన ఈ అవమానాననికి క్షమాపణలు కోరుతున్నాం. హామిల్టన్​లో జరగబోయే తర్వాతి మ్యాచ్​లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని ఆర్చర్​కు హామీ ఇస్తున్నాం" -న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు.

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్‌.. ఇన్నింగ్స్‌ 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 55/3తో సోమవారం ఐదో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లీష్‌ జట్టు.. 197 పరుగులకే ఆలౌటైంది. నీల్‌ వాగ్నర్‌ 5, మిచెల్‌ శాంట్నర్‌ 3 వికెట్లతో సత్తాచాటారు. ఫలితంగా రెండు టెస్టుల సిరీస్‌లో కివీస్‌ బోణీ కొట్టింది.

ఇదీచదవండి: క్రికెట్ ఆస్ట్రేలియా నూతన సెలక్టర్​గా జార్జ్ బెయిలీ!

ABOUT THE AUTHOR

...view details