తెలంగాణ

telangana

By

Published : Jan 6, 2020, 1:15 PM IST

ETV Bharat / sports

మూడో టెస్టులో కివీస్​పై ఆసీస్ విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్

సిడ్నీ వేదికగా న్యూజిలాండ్​తో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా 279 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా 3-0 తేడాతో సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది. ఆసీస్ ఆటగాడు లబుషేన్​కు​ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు లభించాయి.

Australia Won the Test Series Against Newzealand
ఆసీస్ విజయం

న్యూజిలాండ్​తో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించి.. సిరీస్​ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. సిడ్నీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో 279 పరుగుల తేడాతో నెగ్గింది ఆసీస్​. తొలి ఇన్నింగ్స్​లో మార్నస్ లబుషేన్(215) ద్విశతకంతో విజృంభించగా.. రెండో ఇన్నింగ్స్​లో డేవిడ్ వార్నర్(111) సెంచరీతో అదరగొట్టాడు. 415 పరుగుల లక్ష్య ఛేదనలో కివీస్ 136 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బౌలర్లు నాథన్ లియోన్ 5 వికెట్లతో ఆకట్టుకోగా.. స్టార్క్ 3 వికెట్లు తీశాడు. లబుషేన్​.. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'తో పాటు 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అవార్డూ దక్కించుకున్నాడు.

లబుషేన్ ద్విశతకం

రెండో ఇన్నింగ్స్​లో 40/0 స్కోరు వద్ద నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్​.. రెండు వికెట్లు నష్టపోయి 217 పరుగులు చేసి డిక్లేర్ ఇచ్చింది. వార్నర్ శతకంతో అదరగొట్టి.. కెరీర్​లో 23వ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్​లో ద్విశతకంతో చెలరేగిన లబుషేన్ 59 పరుగులు చేశాడు. కివీస్ బౌలర్లు మ్యాట్ హెన్రీ, టాడ్ ఆస్లే చెరో వికెట్ తీశారు.

వార్నర్ శతకం

తొలి ఇన్నింగ్స్​లో ఆస్ట్రేలియా 454 పరుగులకు ఆలౌట్​ కాగా.. అనంతరం బరిలో దిగిన కివీస్ 256 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆసీస్ స్పిన్నర్ లియోన్(5/68, 5/50)రెండు ఇన్నింగ్స్​ల్లోనూ ఐదేసి వికెట్లతో ఆకట్టుకున్నాడు.

ఇదీ చదవండి: కార్చిచ్చు బాధితుల కోసం వార్న్ క్యాప్ వేలం

ABOUT THE AUTHOR

...view details