తెలంగాణ

telangana

ETV Bharat / sports

'రనౌట్'​ రచ్చ: పైన్​ నాటౌట్​.. రహానె ఔట్​ ఎలా​?

బాక్సింగ్​ డే టెస్టులో రనౌట్​ విషయమై తీవ్రంగా చర్చ సాగుతోంది. ఆతిథ్య ఆసీస్​, టీమ్​ఇండియాకు వ్యత్యాసం చూపించడం ఏంటని అంపైర్ల నిర్ణయంపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. డీఆర్​ఎస్​లో మార్పులు చేయాలని మాజీలు కూడా సూచిస్తున్నారు.

"Ajinkya Rahane out but Tim Paine isn't?" - Twitter users furious over dismissal
పైన్​ నాటౌట్​ అయితే.. రహానె ఎలా ఔట్​ అవుతాడు?

By

Published : Dec 28, 2020, 2:26 PM IST

ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో భారత కెప్టెన్​ రహానెను రనౌట్​గా ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అంపైర్లు పక్షపాతం చూపిస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. తొలి ఇన్నింగ్స్​లో మూడో రోజు ఆటలో రహానె బ్యాట్​ క్రీజ్​లైన్​పై ఉన్నప్పటికీ థర్డ్​ అంపైర్​ అతడిని ఔట్​గా ప్రకటించారు. తొలి రోజు సరిగ్గా ఇలాగే క్రీజులైన్​పై బ్యాట్​ పెట్టిన ఆసీస్ సారథి టిమ్​పైన్​కు మాత్రం నాటౌట్ ఇచ్చారు​. ఇరుజట్ల విషయంలో అంపైర్లు ఇలా చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదేం అంపైరింగ్​? (నెటిజన్ల వ్యాఖ్యలు..)

"ఇది పక్షపాతపూరిత అంపైరింగ్ కన్నా ఏమీ కాదు", "రహానె ఎంత తేడాలో ఔటయ్యాడో.. అంతే తేడాతో పైన్​ నాటౌట్​గా నిలిచాడు", "నిన్నటి లెక్క ప్రకారం చూస్తే రహానె నాటౌట్. ఈ ఔట్​కు పైన్​ నాటౌట్​కు తేడా లేదు", "మోసం. ఓ రకమైన సంఘటనలో పైన్​కు మేలు, రహానెకు శిక్ష.. ఇది సరైనది కాదు", "రహానెను త్వరగా ఔట్​ అని తేల్చారు. కానీ, పైన్​ను నాటౌట్​గా ప్రకటించారు. ఇద్దరూ ఔటే"

గల్లీ క్రికెట్​ కన్నా అధ్వాన్నంగా ఐసీసీ నిబంధనలు ఉన్నాయని ఇప్పటికే క్రికెట్​ ప్రముఖులు పలుమార్లు విమర్శించారు. మరీ ముఖ్యంగా డెసిషన్​ రివ్యూ సిస్టమ్​ను (డీఆర్​ఎస్) మార్చాలని​ దిగ్గజ సచిన్​ సహ పలువురు మాజీలు సూచిస్తున్నారు.

బాక్సింగ్​ డే టెస్టు తొలిరోజు ఆటలో టిమ్​పైన్​ను నాటౌట్​గా ప్రకటించడం ఇప్పటికే వివాదాస్పదమైంది. అంపైర్ల నిర్ణయాన్ని వార్న్​ సహ పలువురు మాజీలు తప్పుబట్టారు. 'బెనిఫిట్​ ఆఫ్​ డౌట్​తో' పైన్​ను నాటౌట్​గా ప్రకటించిన వారు రహానె అంశాన్ని ఎందుకు అదే కోణంలో చూడడం లేదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తొలి ఇన్నింగ్స్​లో ఆతిథ్య ఆసీస్​ను 195 పరుగులకే టీమ్​ఇండియా కట్టడి చేసింది. అనంతరం బ్యాటింగ్​కు దిగిన భారత్.. తొలి ఇన్నింగ్స్​లో 326 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్​ రహానె 112, జడేజా 57 , గిల్ 45 అద్భుత ప్రదర్శన చేశారు. మూడో రోజు పూర్తయ్యేసరికి రెండో ఇన్నింగ్స్​లో ఆసీస్ 6 వికెట్ల నష్టానికి 133 పరుగులతో ఉంది.

ఇదీ చూడండి:'డీఆర్​ఎస్​తో ఆటగాళ్లకు న్యాయం జరగట్లేదు'

ABOUT THE AUTHOR

...view details