తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆసీస్​ బోర్డుకు బీసీసీఐ లేఖ.. ఎందుకంటే?

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన నాలుగో టెస్టును ఐపీఎల్​ నిర్వహించిన బయోబుడగ తరహా వాతవరణంలో జరపాలని ఆస్ట్రేలియా క్రికెట్​ బోర్డును కోరింది బీసీసీఐ. కఠినమైన క్వారంటైన్​ నిబంధనల్లో సవరణలు చేయాలని విజ్ఞప్తి చేసింది.

bcci
బీసీసీఐ

By

Published : Jan 7, 2021, 7:09 PM IST

బ్రిస్బేన్​లో జరగబోయే నాలుగో టెస్టు ముందు ఆసీస్​-భారత్ ఆటగాళ్లు క్వారంటైన్​ వంటి కఠిన నియమావళిని పాటించాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనల్లో సవరణలు చేయాలని ఆస్ట్రేలియా క్రికెట్​ బోర్డుకు తాజాగా విజ్ఞప్తి చేసింది బీసీసీఐ. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియాకు ఓ లేఖను పంపింది.

"క్వారంటైన్​ నియమావళిలో సవరణలు చేసే విషయమై ఇప్పటివరకు చర్చలు జరిగాయి. అయితే ఈ రోజు ఇదే విషయమై ఆస్ట్రేలియా క్రికెట్​ బోర్డుకు అధికారికంగా లేఖను పంపాం. ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చాక రెండు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు క్వారంటైన్​లలో ఉండాలని ముందుగా మేము ఎటువంటి ఒప్పందం చేసుకోలేదు. ఇప్పటికే సిడ్నీలో ఓసారి క్వారంటైన్​లో ఉన్నాం. మా డిమాండ్​ చాలా సింపుల్​. ఐపీఎల్​ను నిర్వహించిన బయోబుడగలో ఎటువంటి నిబంధనలను పెట్టామో అలాంటి నిబంధనలే ఈ క్వారంటైన్​లోనూ ఉండాలని అడిగాం. మొత్తంగా ఐపీఎల్​ నిర్వహించిన బయోబుడగ తరహా వాతావరణంలో నాలుగో టెస్టును నిర్వహించాలని కోరాం. క్వారంటైన్ సమయంలో ఆటగాళ్లు స్నేహపూర్వకంగా కలిసి, మాట్లాడుకునే విధంగా ఉండాలి. హోటల్​ లోపల మా ఆటగాళ్లు కలిసి మెలిసి భోజనం చేయాలనుకుంటారు. కానీ ఆసీస్​ బోర్డు మాత్రం ఒక్క ఫ్లోరుకు చెందిన ఆటగాళ్లు మాత్రమే కలిసి ఉండాలని, రెండు వేరు వేరు ఫ్లోర్లకు చెందిన ఆటగాళ్లు కలవకూడదని అంటోంది. ఇవి చాలా కష్టంతో కూడుకున్నవి."

-బీసీసీఐ ఉన్నతాధికారి.

అంతకుముందు సిడ్నీలో ఉన్న క్వారంటైన్​ నిబంధనలపై తాత్కాలిక సారథి అజింక్యా రహానె అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇలాంటి రూల్స్ వల్ల ఆటగాళ్లపై ఒత్తిడి పెరుగుతుందని చెప్పాడు. కాగా, జనవరి 15 నుంచి 19వరకు నాలుగో టెస్టు జరగనుంది.

ఇదీ చూడండి :'నాలుగో టెస్టు బ్రిస్బేన్​లోనే నిర్వహించాలి'

ABOUT THE AUTHOR

...view details