ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచిన పీవీ సింధు.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని కలిసింది. హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి కుటుంబ సమేతంగా వెళ్లింది. ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించిన సింధును ఉపరాష్ట్రపతి ప్రశంసించారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్యను కలిసిన పీవీ సింధు
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని హైదరాబాద్‌లో కలిసింది పీవీ సింధు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన ఆమెను ఉపరాష్ట్రపతి ప్రశంసించారు.
వెంకయ్యనాయుడు
స్విట్జర్లాండ్ బాసెల్ వేదికగా జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఫైనల్లో జపాన్‌కు చెందిన ఒకుహరపై విజయం సాధించింది సింధు. 21-7, 21-7 తేడాతో స్వర్ణం నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్‌గా చరిత్ర సృష్టించింది.
ఇది చదవండి: ఆదుకున్న కోహ్లీ, క్రీజులో విహారి.. భారత్ 264/5
Last Updated : Sep 28, 2019, 10:59 PM IST