తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆమిర్​ను ఫాలో కాని తనయుడు - జునైద్​

బాలీవుడ్​ సూపర్​స్టార్​ ఆమిర్ ​ఖాన్​ తన పెద్ద కొడుకు జునైద్​ భవిష్యత్తుపై మరోసారి పెదవి విప్పాడు. సినిమాల కన్నా నాటకాలంటే ఎక్కువ ఇష్టపడుతున్నట్లు వెల్లడించాడు. 26 ఏళ్ల తన కుమారుడి నిర్ణయాన్ని పూర్తిగా సమర్థిస్తున్నానంటూ తన అభిప్రాయాన్ని చెప్పాడు​.

అమీర్​ను ఫాలో అవ్వని తనయుడు

By

Published : Mar 17, 2019, 9:56 AM IST

Updated : Mar 17, 2019, 10:25 AM IST

బాలీవుడ్​ టాప్​ నటుడుగా ఉన్న అమీర్​​.. తన మొదటి భార్య కొడుకు జునైద్​ను వెండితెరకు ఎప్పుడు పరిచయం చేస్తాడా అంటూ ఎప్పుడూ ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉంటుంది మీడియా. ఈ విషయంపై మరోసారి తన అభిప్రాయం వెల్లడించాడీ పీకే నటుడు.

  1. సినిమాలకు తన పేరు, ప్రఖ్యాతలతో కాకుండా ప్రతిభ​తో రావాలి. ఇష్టం ఉన్న ఏ రంగాన్ని ఎంచుకున్నా ఫర్వాలేదంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు అమిర్ ఖాన్.
  2. ఎలాంటి నిర్ణయమైనా స్వేచ్ఛగా తీసుకోవాలని జునైద్​కు చెప్పినట్లు అమిర్​ తెలిపాడు. ప్రస్తుతం సినిమాల కంటే నాటకాలను నిర్మించాలనే పట్టుదలతో ఉన్నాడంటూ వెల్లడించాడు అమీర్​​.

ఇప్పటికే థియేటర్​కు సంబంధించిన కోర్సులు చేశాడు. ఈ విషయంలో నా తోడ్పాటు, ప్రోత్సాహం ఇస్తున్నా. అతడు చాలా తెలివైనవాడు అంటూ మాట్లాడాడు ఈ దంగల్​ నటుడు.

గతంలో ఈ స్టార్​ నటించి రాజ్​కుమార్​ హిరానీ దర్శకత్వం వహించిన 'పీకే' చిత్రానికి అసిస్టెంట్​ డైరెక్టర్​గా పనిచేశాడు జునైద్​.

  • గతంలోనూ జునైద్​ సినిమా అరంగేట్రంపై మాట్లాడుతూ...నా కొడుకు సినిమాల్లోకి రావాలంటే స్వతహాగా ఆడిషన్స్​కు వెళ్లి ఎంపిక కావాలి. టాలెంట్, ప్రత్యేకత ​నాకు నచ్చితే నేనే ఆ వైపుగా ప్రోత్సహిస్తా అంటూ స్పష్టంచేశాడు.
    రెండో భార్య కిరణ్​రావ్​​తో
  • భార్యే మార్చింది..

రెండు, మూడు సంవత్సరాల క్రితం కిరణ్​ నాతో చెప్పిందేంటంటే... నేను తనని, పిల్లల్ని పట్టించుకోవట్లేదని ఫిర్యాదు​ చేసింది. అప్పటి నుంచి నేను మారాను. అందుకే సాయంత్రం 6 గంటలకు ఇంటికి చేరుకుంటున్నాను. రెండు గంటలు నా ఎనిమిదేళ్ల చిన్న కొడుకు ఆజాద్​తో ఆడుకుని మళ్లీ నా పనిలో మునిగిపోతున్నాను. కానీ ఆ రెండు గంటలే నేను వాడితో ఉండగలుగుతున్నా.

-- అమీర్ ఖాన్, బాలీవుడ్ నటుడు

భార్య కిరణ్​రావ్​​, ఆజాద్​తో అమీర్​
Last Updated : Mar 17, 2019, 10:25 AM IST

ABOUT THE AUTHOR

...view details