తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సెలబ్రిటీల గురించి ఈ విషయాలు తెలుసా!

సినీ తారలకు సంబంధించిన ఏ విషయమైనా తెలుసుకునేందుకు అభిమానులు ఉత్సుకత చూపిస్తుంటారు. తెలుసుకున్నాక వాటి గురించే మాట్లాడుకుంటుంటారు. ఈ నేపథ్యంలో మహేశ్​బాబు వాట్సప్​ డీపీ, హీరో కార్తికేయ ఫోన్​ వాల్​పేపర్ ఇలా పలువురు తారల కొన్ని వ్యక్తిగత విశేషాలు మీకోసం..​

mahesh
మహేశ్​

By

Published : Apr 11, 2021, 12:48 PM IST

ఆలియాభట్‌ ఫోన్‌ వాల్‌పేపర్‌ ఏమై ఉంటుంది? అభిమానుల నుంచి పొందిన బహుమతుల్లో తమన్నా మనసుకు హత్తుకున్న గిఫ్ట్‌ ఏది?.. ఇలా చెప్పుకొంటూ వెళితే సెలబ్రిటీలకు సంబంధించిన కొన్ని వ్యక్తిగత విశేషాలను తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు.

ఒకవేళ ఎప్పుడైనా అలాంటి చిన్న చిన్న విషయాలు బయటకు వస్తే అందరూ దాని గురించే మాట్లాడుకుంటారు. ఈ క్రమంలోనే ఇటీవల 'వైల్డ్‌డాగ్‌' ప్రమోషన్‌లో భాగంగా నాగార్జున షేర్‌ చేసిన చాట్‌ వల్ల మహేశ్‌బాబు వాట్సాప్‌ డీపీ అందరికీ తెలిసింది. దీంతో ఆ డీపీ చూసిన సూపర్‌స్టార్‌ అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు..! ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలకు సంబంధించిన కొన్ని వ్యక్తిగత విశేషాలపై ఓ లుక్కేద్దాం రండి..!

వేటకు సిద్ధమైన సింహం.. మహేశ్‌ వాట్సాప్‌ డీపీ
ప్రియుడిని హత్తుకున్న ఆలియా.. అదే ఆమె ఫోన్‌ వాల్‌పేపర్‌
మెగాస్టార్‌ చిరంజీవితో దిగిన ఫొటోనే కార్తికేయ ఫోన్‌ వాల్‌ పిక్‌
అనసూయ వాట్సాప్‌ డీపీ ఇదే..!
నాగ్‌ ఫోన్‌లో చిరంజీవి కాంటాక్ట్‌ ఈ పేరుతోనే..!
తమన్నా మేకప్‌ రూమ్‌.. అభిమానులిచ్చిన ఫొటో ఫ్రేమ్‌
ఉపాసన మేకప్‌ రూమ్‌.. సితారతో క్యూట్‌ ఫొటో

ఇదీ చూడండి: సినిమాల్లో అలరించి.. బిజినెస్​మ్యాన్​ను పెళ్లాడి!

ABOUT THE AUTHOR

...view details