తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వెండితెరపై.. మాస్ హీరోగా.. వినాయక్!

ఆది, ఠాగూర్, దిల్, చెన్నకేశవరెడ్డి, అదుర్స్, నాయక్, ఖైదీ నెంబర్ 150 లాంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు వి.వి.వినాయక్ కొత్త అవతారమెత్తాడు. 'సీనయ్య' సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. ఈ రోజు అతడి పుట్టినరోజు సందర్భంగా మంగళవారం 'సీనయ్య' ఫస్ట్​లుక్ విడుదల చేసింది చిత్రబృందం.

వెండితెరపై.. మాస్ హీరోగా.. వినాయక్!

By

Published : Oct 9, 2019, 5:31 AM IST

Updated : Oct 9, 2019, 7:35 AM IST

తెలుగుతెరపై సుమోలు ఎగిరించినా.. కథానాయకులతో తొడలు కొట్టించినా.. మాస్​ ప్రేక్షకులను ఉర్రూతలూగించినా.. తెలుగు నాట ఒకే పేరు వినిపిస్తుంది.. అతడే వి.వి.వినాయక్. విలక్షణ దర్శకుడిగా​ పేరు తెచ్చుకున్న వినాయక్.. హీరోగానూ నిరూపించుకోనేందుకు సిద్ధమవుతున్నాడు.త్వరలో 'సీనయ్య' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ రోజు వినాయక్ పుట్టినరోజు సందర్భంగా అతడిపై ప్రత్యేక కథనం.

'ఆది'తో మెగాఫోన్​ పట్టిన వి.వి.వినాయక్ అసలు పేరు గండ్రోతు వీర వెంకట్ వినాయక్. 'చెన్నకేశవ రెడ్డి', 'దిల్', 'ఠాగూర్' ఇలా వరుస విజయాలతో దూసుకెళ్లాడు. తర్వాత వచ్చిన సాంబ ఫర్వాలేదనిపించినా బన్నీ, లక్ష్మీ సినిమాలతో మళ్లీ హిట్​ ట్రాక్​లోకి వచ్చాడు. మధ్యలో యోగి పరాజయాన్ని చూసింది.

ట్రాక్ మార్చిన వినాయక్​..

హాస్యప్రధానంగా సాగిన కృష్ణ, అదుర్స్ చిత్రాలతో వినాయక్​ తనలోని మరో కోణాన్ని బయటపెట్టాడు. బద్రీనాథ్​తో ఓ భారీ ప్రయత్నం చేసిన ఆయన నాయక్‌, అల్లుడు శీను చిత్రాలతో తన మార్క్‌ను ప్రదర్శించాడు. ఖైదీ నంబర్‌150తో మళ్లీ సత్తా చాటాడు.

ఎన్టీఆర్ సినిమాతోనంది..

వినాయక్ తెరకెక్కించిన 'ఆది'తో నంది పురస్కారం అందుకున్నాడు. అక్కినేని అఖిల్​ను కథానాయకుడిగా పరిచయం చేసిన ఘనత కూడా ఇతడి​కే దక్కింది.

హీరోగా కొత్త అవతారం..

కమర్షియల్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వినాయక్.. తనలోని నటుడిని పరిచయం చేస్తున్నాడు. దిల్​రాజు నిర్మిస్తున్న 'సీనయ్య' చిత్రంలో ప్రధాన పాత్ర పోషించనున్నాడు. ఎన్​. నరసింహా దర్శకుడు.

సీనయ్య ఫస్ట్​లుక్​

మెకానిక్​ రూపంలో వినూత్నంగా కనిపిస్తున్నాడీ దర్శకుడు. ఇప్పటికే ఠాగూర్, అదుర్స్, ఖైదీ నెంబర్ 150 సినిమాల్లో అతిథి పాత్రల్లో మెరిశాడు.

ఇదీ చదవండి: మెకానిక్​ 'సీనయ్య'గా వినాయక్​ లుక్​..!

Last Updated : Oct 9, 2019, 7:35 AM IST

ABOUT THE AUTHOR

...view details