దక్షిణాదిలో అటు హీరోగా, ఇటు సహాయ పాత్రల్లో నటిస్తూ బిజీగా ఉన్న వారిలో విజయ్ సేతుపతి ముందుంటాడు. ఈ ఏడాది వచ్చిన 'పేట', 'సైరా' తదితర చిత్రాల్లో కీలక పాత్రల్లో పోషించి, ప్రేక్షకులను అలరించాడు. ఇప్పుడు స్టార్ హీరో కమల్‌హాసన్ పక్కన విలన్‌గా అవకాశం కొట్టేశాడు. 'భారతీయుడు-2'లో విజయ్ పాత్రకు సంబంధించిన షూటింగ్, వచ్చే ఫిబ్రవరిలో ప్రారంభం కానుందని సమాచారం.
'భారతీయుడు-2'లో విలన్‌గా విజయ్ సేతుపతి?
తమిళ ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి.. కమల్ 'భారతీయుడు-2'లో ప్రతినాయకుడిగా అవకాశం దక్కించుకున్నాడట. వచ్చే ఫిబ్రవరి నుంచి అతడి పాత్రకు సంబంధించిన షూటింగ్ మొదలు కానుంది.
'భారతీయుడు-2'లో విలన్‌గా విజయ్ సేతుపతి
రాజస్థాన్‌లో 'భారతీయుడు-2' చిత్రీకరణ జరుగుతోంది. కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, బాబీ సింహా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
ఇది చదవండి: కమల్ 'భారతీయుడు 2'కు లీకుల బెడద