కరోనా భయంతో మరో క్రేజీ హాలీవుడ్ సినిమా విడుదల వాయిదా పడింది. 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియన్ 9'ను తొలుత ఈ ఏడాది మే 22న తీసుకురావాలనుకున్నారు. ఈ వైరస్ కారణంగా, ఏకంగా వచ్చే ఏడాది ఏప్రిల్ 2కు ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అయితే ముందుగా ఈ తేదీకి పదో భాగాన్ని తేవాలనుకున్నారు. ఇప్పుడు అదీ వెనక్కు జరిగే అవకాశముంది.
కరోనా దెబ్బకు ఈ ఏడాది తర్వాతే ఆ హాలీవుడ్ సినిమా
త్వరలో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9'.. ఏకంగా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్రబృందం ప్రకటించింది.
'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9'
ఇదే కాకుండా 'ఏ క్వైట్ ప్లేస్ 2', 'నో టైమ్ టూ డై', 'పీటర్ రాబిట్ 2' సినిమాల విడుదలలు వాయిదా పడ్డాయి. ఇప్పటికే కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా 4700 మందికి పైగా మరణించగా, లక్ష 30 వేల మందికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది.