కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఆదివారం (మార్చి 22) జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రజలను కోరారు. దీనికి పలువురు సెలిబ్రిటీలూ మద్దతు తెలిపారు. కర్ఫ్యూ గురించి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. అయితే కొన్ని పోస్టులు నిబంధనలకు విరుద్ధంగా ఉండటం వల్ల ట్విట్టర్ వాటిని తొలగించింది. ఇందులో రజనీకాంత్, పవన్ కల్యాణ్ ట్వీట్స్ ఉన్నాయి.
'అబద్ధం' చెప్పారని పవన్, రజనీ ట్వీట్స్ డిలీట్ - రజనీకాంత్ పవన్ కల్యాణ్
కరోనా నేపథ్యంలో ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూ విధించారు. దీనికి మద్దతుగా పలువురు సెలిబ్రిటీలు ట్విట్టర్లో పోస్టులు పెట్టారు. అయితే రజనీకాంత్, పవన్ కల్యాణ్ ట్వీట్లు నిబంధనలకు విరుద్ధంగా ఉండటం వల్ల వాటిని తొలగించింది ట్విట్టర్ యాజమాన్యం.

Actor Rajini
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన ట్వీట్లో 12 గంటల్లో కరోనా వైరస్ చనిపోతుందని ఉంది. పవన్ కల్యాణ్ పోస్టులో కూడా ఇలాగే ఉంది. వీటిని ఫేక్ న్యూస్‌గా గుర్తించింది ట్విట్టర్ యాజమాన్యం. వెంటనే రజనీ, పవన్ చేసిన ట్వీట్లు తొలగించింది.
కరోనాపై తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే ట్వీట్లను గుర్తించి, తొలగించాలని ఇప్పటికే సామాజిక మాధ్యమాలను కోరింది కేంద్ర ప్రభుత్వం.
TAGGED:
Cites Violation