తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చిన్నప్పుడే హీరోయిన్​గా ఎంపికై.. ప్రేక్షకులకు దగ్గరై

చిన్న వయసులోనే చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన తారలు.. తొలి చిత్రంతోనే చాలామంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. తమ అందం, అభినయంతో వరుస అవకాశాలను దక్కించుకుంటున్నారు. అలాంటి ముద్దుగుమ్మల గురించే ఈ కథనం.

Those who became heroines at a young age
చిరుప్రాయంలోనే హీరోయిన్​గా ఎంపికైన తారలు!

By

Published : Feb 10, 2021, 9:07 AM IST

పదిహేడేళ్లకే హీరోయిన్​గా అవకాశం దక్కించుకున్నారు కన్నడ భామ కృతిశెట్టి. ఆమె నటిస్తోన్న తొలి చిత్రం 'ఉప్పెన' విడుదల కాకముందే కృతి అందానికి కుర్రకారు ఫిదా అయ్యారు. అలా చిన్న వయసులోనే చిత్రసీమలో అడుగుపెట్టిన హీరోయిన్​గా స్టార్​ హోదా పొందిన వారు చాలామంది ఉన్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్​లో తక్కువ వయసులోనే కథానాయికలుగా మారిన వారెవరో తెలుసుకుందాం.

కృతిశెట్టి

కర్ణాటక మంగుళూరులో 2003 సెప్టెంబరు 21న పుట్టింది​ కృతిశెట్టి. చిన్నప్పుడే మోడల్​గా కెరీర్​ ప్రారంభించి పలు వాణిజ్య ప్రకటనల్లో నటించింది. 17 ఏళ్లకే 'ఉప్పెన' సినిమాకు హీరోయిన్​​గా ఎంపికైంది. ఫిబ్రవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలిచిత్రం విడుదల కాకముందే 'శ్యామ్​సింగరాయ్​', సుధీర్​బాబు-మోహన్​కృష్ణ ఇంద్రగంటి చిత్రంలో ఛాన్సు కొట్టేసింది.

కృతిశెట్టి

మాళవిక శర్మ

మాళవిక శర్మ.. 1999 జనవరి 26న ముంబయిలో జన్మించింది. మోడలింగ్​లో అడుగుపెట్టి వాణిజ్య ప్రకటనల్లో నటించింది. ఆ తర్వాత 'ది వే హోమ్​'(2010) చిత్రంలో చిన్నపాత్ర చేసింది. రవితేజ 'నేల టికెట్టు' సినిమా కోసం 19 ఏళ్లకే హీరోయిన్​గా అవకాశాన్ని దక్కించుకుంది. ఇటీవల సంక్రాంతికి వచ్చిన 'రెడ్'​ చిత్రంలోనూ ఓ కథానాయికగా చేసింది.

మాళవిక శర్మ

శ్వేతాబసు ప్రసాద్​

పదేళ్ల వయసు నుంచే బాలీవుడ్​లో బాలనటిగా చేస్తూ.. 17 ఏళ్ల వయసులోనే 'కొత్త బంగారు లోకం'తో హీరోయిన్​గా అరంగేట్రం చేసింది శ్వేతబసు ప్రసాద్​. ఆ తర్వాత తెలుగు, తమిళ, బెంగాలీ సినిమాల్లో వరుస ఆఫర్లను దక్కించుకుని గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం హిందీ చిత్రం 'ఇండియా లాక్​డౌన్​'లో నటిస్తుంది.

శ్వేతాబసు ప్రసాద్​

హన్సిక

హన్సిక మోత్వానీ.. మహారాష్ట్రలోని ముంబయిలో 1991 ఆగస్టు 9న జన్మించింది. బుల్లితెర నుంచి కెరీర్​ ప్రారంభించి, బాలీవుడ్​లోని పలు​ చిత్రాల్లో బాలనటిగా మెప్పించింది. టాలీవుడ్​లో అల్లు అర్జున్​ - పూరీ జగన్నాథ్​ కాంబినేషన్​లో వచ్చిన 'దేశముదురు' సినిమా కోసం 16 ఏళ్లకే హీరోయిన్​గా ఎంపికైంది. ఆ తర్వాత తెలుగు, తమిళంలో చాలా సినిమాలు చేసింది. తెలుగులో చివరగా 'తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్​'తో మెప్పించారు. ప్రస్తుతం తమిళ చిత్రం 'మహా'లో నటిస్తున్నారు.

హన్సిక

నివేదా థామస్​

కేరళలోని కన్నూర్​లో 1995 నవంబరు 2న నివేదా థామస్​ పుట్టింది. టీవీ సీరియల్స్​లో బాలనటిగా కెరీర్​ను ప్రారంభించిన ఈమె.. ఆ తర్వాత మలయాళంలో తెరకెక్కిన 'వేరుతు ఓరు భార్య' సినిమాకుగాను బాలనటిగా కేరళ రాష్ట్ర అవార్డును అందుకుంది. ఇదే ఆమె నటించిన తొలిచిత్రం కావడం విశేషం.

నివేదా థామస్​

14 ఏళ్ల వయసులోనే మలయాళ సినిమాల్లో నివేదా ప్రధాన పాత్రలు పోషించింది. 19 ఏళ్లకే టాలీవుడ్​లో 'జెంటిల్​మ్యాన్​' చిత్రంతో హీరోయిన్​గా పరిచయమైంది. ప్రస్తుతం 'వకీల్​ సాబ్​', 'శ్వాస' సినిమాలతో పాటు సుధీర్​ వర్మ దర్శకత్వంలో నటిస్తోంది.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details