తెలంగాణ

telangana

By

Published : Aug 13, 2020, 5:45 AM IST

ETV Bharat / sitara

'గుంజన్​ సక్సెనా'పై భారత వాయుసేన అసంతృప్తి

బాలీవుడ్​ హీరోయిన్​ జాన్వీకపూర్​ 'గుంజన్​ సక్సెనా : ది కార్గిల్​ గర్ల్'​ చిత్రంపై అసహనం వ్యక్తం చేస్తూ సెన్సార్​ బోర్డుకు లేఖ రాసింది భారత వాయుసేన. ఈ చిత్రంలోని సన్నివేశాలు తమను అవమానించినట్లుగా ఉన్నాయని అభిప్రాయపడింది. సినిమాలో సీన్లు వాస్తవానికి అనుగుణంగా లేవని స్పష్టం చేసింది.

'Gunjan Saxena: The Kargil Girl',
'గుంజన్​ సక్సెనా'పై భారత వాయు సేన అసంతృప్తి

బాలీవుడ్​ నటి జాన్వీకపూర్​ నటించిన 'గుంజన్​ సక్సెనా : ది కార్గిల్​ గర్ల్'.. ఆగస్టు 12న​ ఓటీటీ ప్లాట్​ఫాంలో విడుదలై విశేష స్పందన అందుకుంటోంది. అయితే తాజాగా దీనిపై స్పందించిన భారత వాయు సేన.. చిత్రంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సెన్సార్​ బోర్డుకు లేఖ రాసింది. చిత్రంలోని కొన్ని సన్నివేశాలు వాస్తవికతకు దగ్గరగా లేవని స్పష్టం చేసింది. కొన్ని సన్నివేశాల్లో తమ సంస్థను అవమానకరంగా చూపించారని ఆరోపించింది.

ఇదే విషయంపై అసంతృప్తి చెందుతూ సినిమా విడుదల కాకముందే చిత్రనిర్మాణ సంస్థ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని లేఖలో పేర్కొంది. కానీ చిత్రబృందం బేఖాతరు చేస్తూ ఈ అంశాన్ని పట్టించుకోలేదని తెలిపింది. దీనిపై సమీక్షించి సదరు సన్నివేశాల్ని వాస్తవానికి అనుగుణంగా మార్చడం లేదా వాటిని తొలగించడం చేయాలని సూచించింది.

ఇది చూడండి రివ్యూ: కార్గిల్‌ గర్ల్ 'గుంజన్'‌ ఆకట్టుకుందా

ABOUT THE AUTHOR

...view details