వినూత్న సినిమాలు, విలక్షణ నటనతో బాలీవుడ్లో తనదైన రీతిలో రాణిస్తోంది హీరోయిన్ తాప్సీ. ఇప్పుడు.. ప్రముఖ గుజరాతీ అథ్లెట్ రష్మీ జీవితం ఆధారంగా వస్తున్న 'రష్మీ రాకెట్' చిత్రంలో నటిస్తోంది. మోషన్ పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేసింది చిత్రబృందం.
"తర్వాతి మిషన్ కోసం ట్రాక్‌పై దూసుకెళ్లేందుకు సిద్ధమైందీ రాకెట్" అంటూ బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ ట్వీట్ చేశాడు.