కరోనా ప్రభావంతో భారత్‌లో 21 రోజులు లాక్డౌన్ విధించారు. ఇంట్లోనే ఉన్న పలువురు సెలబ్రిటీలు.. వంట, వ్యాయామానికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుని, అభిమానుల్ని అలరిస్తున్నారు. అయితే నటి సుస్మితాసేన్.. తన బాయ్‌ఫ్రెండ్ రొహమన్ షాల్‌తో వర్కవుట్స్ చేస్తూ కనిపించింది. ఆ ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
ప్రియుడితో కలిసి సుస్మితాసేన్ హాట్ వర్కవుట్స్ - కరోనా మరణాలు
బాలీవుడ్ నటి సుస్మితాసేన్.. తన బాయ్‌ఫ్రెండ్ రొహమన్‌తో కలిసి వర్కవుట్స్ చేస్తున్న ఫొటోలను ఇన్‌స్టాలో పంచుకుంది. ప్రస్తుతం ఇవి నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

సుస్మితాసేన్ వర్కవుట్స్
కష్టకాలం ఎప్పటికీ ఉండదని, ఈ సమయంలో బలంగా ఉన్నవారే విపత్తును దాటగలరని ఇన్‌స్టాలో సుస్మితా రాసుకొచ్చింది. మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారు కావాలని నెటిజన్లకు చెప్పింది.
42 ఏళ్ల సుస్మితా.. తన కంటే 15 ఏళ్లు చిన్నవాడైన మోడల్ రొహమన్ షాల్‌తో ప్రస్తుతం డేటింగ్లో ఉంది. రాణి, అలీషా అనే ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకుని, పెంచుకుంటోంది.