'అమ్మాయి ఎలా ఉన్నా పర్వాలేదు.. పెళ్లి చేసుకుంటా..' అని ట్రైలర్‌తోనే ఆసక్తి పెంచేశాడు బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్ధిఖీ. ఈ స్టార్ హీరో నటించిన నయా చిత్రం 'మోతీచూర్ ఛక్నాచూర్'. ఇందులో అతియా శెట్టి కథానాయిక. దేబ్మిత్రా బిస్వాల్ దర్శకుడు. ఈ సినిమాలో 'బత్తియాన్ బుజాదో' అనే ప్రత్యేక గీతానికి సన్నీలియోని నర్తించింది. ఈ వీడియోను నేడు విడుదల చేసింది చిత్రబృందం.
బాలీవుడ్ నటుడి ముందు సన్నీలియోని హాట్డ్యాన్స్ - Nawazuddin Siddiqui, Sunny Leone
బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్ధిఖీ ముందు సన్నీలియోని హాట్స్టెప్పులతో అదరగొట్టింది. వినోదాత్మక కథాశంతో తెరకెకెక్కుతోన్న ఓ చిత్రం కోసం ఈ విధంగా చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

బాలీవుడ్ నటుడి ముందు సన్నీలియోనీ హాట్డ్యాన్స్
జీవిత భాగస్వామి కోసం ఎంతో ఆరాటంగా ఎదురుచూస్తున్న ఇద్దరి కథాంశంతో ఆద్యంతం హాస్యభరితంగా తెరకెక్కిందీ చిత్రం. నవంబరు 15న విడుదల కానుంది.
'మాంటో', 'ఠాక్రే', 'లంచ్ బాక్స్' వంటి చిత్రాల్లో నటించిన నవాజ్... తన నటనతో ఎందరో అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. ఇటీవల సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన 'పేట' చిత్రంలో ఈ విలక్షణ నటుడు కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం 'రాత్ అకేలీ హై' చిత్రంలోనూ నటిస్తున్నాడు.
TAGGED:
సన్నీలియోనీ హాట్స్టెప్పులు