బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'సూపర్ 30'. బిహార్‌కు చెందిన గణితవేత్త ఆనంద్ కుమార్ స్థాపించిన 'సూపర్30' అనే ఐఐటీ శిక్షణ సంస్థ నేపథ్యంలో ఈ సినిమాను దర్శకుడు వికాస్ బెహెల్ తెరకెక్కించాడు. తాజాగా జులై 12తో ఈ సినిమా విడుదలై ఏడాది పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా హృతిక్ దీనిపై స్పందించాడు. ఆనంద్‌కుమార్ పాత్ర పోషించడం తన కెరీర్లోనే ఓ ప్రత్యేకమైన అనుభవమని ఆనందం వ్యక్తం చేశాడు.
"అప్పుడే ఈ చిత్రం ఏడాది పూర్తిచేసుకుందనే విషయాన్ని నమ్మలేకపోతున్నా. 'సూపర్ 30' విజయం సాధించినప్పుడు పొందిన అనుభూతి నా ఇతర ఏ చిత్ర విజయానికి పొందలేదు. కెమెరా ముందు ఆనంద్ కుమార్లా నటించడం ఓ ప్రత్యేకమైన అనుభూతి. "