తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సామ్రాట్‌ అశోక్‌'లో ఒక్కొక్కరూ పలు పాత్రలు

సీనియర్​ ఎన్టీఆర్​ ప్రధానపాత్రలో నటించిన సామ్రాట్ అశోక్, విశ్వామిత్ర, దాన వీర శూర కర్ణ సినిమాల్లో ఒక పదిమంది ఉపనటుల్ని తీసుకుని వాళ్లతోనే 50, 60 పాత్రలు ధరింపజేశారు.

నందమూరి

By

Published : Aug 11, 2019, 5:31 AM IST

Updated : Aug 11, 2019, 6:43 AM IST

ఎన్‌.టి.రామారావు స్వీయ దర్శకత్వంలో 'సామ్రాట్‌ అశోక్‌' (28/05/1992) చిత్రాన్ని నిర్మించారు. ఇందులో ఎన్టీఆర్​,భానుమతి ముఖ్య పాత్రల్లో నటించారు. అయితే, అక్కడక్కడ వచ్చే పాత్రల్ని పోషించిన వాళ్లే మళ్లీ మళ్లీ కనిపించారు. అంటే ఒక పదిమంది ఉపనటుల్ని తీసుకుని వాళ్లతోనే 50, 60 పాత్రలు ధరింపజేశారు. చాలామందిని గుర్తుపట్టవచ్చు. అలాగే 'విశ్వామిత్ర’లోనూ విశ్వామిత్రుడి శిష్యులుగా వేసిన వాళ్లే... హరిశ్చంద్రుడి పరివారంలోనూ కనిపిస్తారు. ఇప్పటి సినిమాల్లో తండ్రి పాత్రల్లో రాణిస్తున్న చలపతిరావు 'దాన వీర శూర కర్ణ'లో ఐదు పాత్రల్లో కనిపిస్తాడు. అయితే అప్పుడు చలపతిరావు పెద్దగా తెలియదు కనుక.. మనం గుర్తు పట్టలేం. ఇప్పుడు చూస్తే గుర్తు పడతాం.

Last Updated : Aug 11, 2019, 6:43 AM IST

ABOUT THE AUTHOR

...view details