తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'నా కుమారుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు'

సుశాంత్ కుటుంబాన్ని ఇటీవలే పరామర్శించిన నటుడు శేఖర్ సుమన్.. గతంలో ఓసారి తన కుమారుడు ఆత్యహత్య చేసుకోవాలనుకున్నాడని వెల్లడించాడు. అందుకు గల కారణాల్ని తెలిపాడు.

'నా కుమారుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు'
కుమారుడు ఆధ్యాయన్​తో శేఖర్ సుమన్

By

Published : Jul 1, 2020, 10:31 AM IST

ప్రముఖ నటుడు, బుల్లితెర వ్యాఖ్యాత శేఖర్‌ సుమన్‌.. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్యపై ఎంతో ఆవేదన చెందుతున్నాడు. ఇటీవలే అతడి‌ కుటుంబ సభ్యులను పరామర్శించిన శేఖర్.. బిహార్‌ ముఖ్యమంత్రికి సుశాంత్‌ మరణంపై సీబీఐ విచారణ చేయాలని విజ్ఞప్తి చేశాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పలు విషయాలు పంచుకున్నాడు.

"సుశాంత్‌ నా కొడుకులాంటి వాడు. ఏంతో కష్టపడి ఈ దశకు చేరాడు. అ?అతడి మరణం నాకు భయాన్ని కలిగిస్తోంది. గతంలో నా కుమారుడు అధ్యాయన్ నిరాశతో బాధపడి, ఇలాంటి దశను అనుభవించాడు. 'చిత్రసీమలో నాకు అడ్డంకులు ఉన్నాయి. ఆత్మహత్య చేసుకోవాలని ఉందని' ఆధ్యాయన్ ఓసారి నాతో అన్నాడు. అప్పుడు చాలా భయమేసింది. అప్పుడప్పుడు నేను తెల్లవారుజామున అతడి గదికి వెళ్లి తనిఖీ చేసేవాణ్ని. ఆ సమయంలో మావాడు ఇంటిపైకప్పుకేసి తదేకంగా చూసేవాడు. నువ్వు ప్రశాంతంగా నిద్రపో..నేను ఉన్నాను అనే భరోసా ఇచ్చేవాణ్ణి అంటూ చెప్పానని" గుర్తు చేసుకున్నాడు శేఖర్ సుమన్.

ABOUT THE AUTHOR

...view details