తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఈ స్టార్​ హీరోల తొలి రెమ్యునరేషన్​ ఎంతో తెలుసా? - తొలి రెమ్యునరేషన్​

బాలీవుడ్​ స్టార్​ హీరోస్​... వారి సినీమాల్లోకి రాకముందు తమ జీవనోపాధి కోసం ఏమి పనిచేశారు? తొలి జీతం ఎంత అందుకున్నారు? ఎవరికైనా తెలుసా? ఆ విశేషాలన్నీ మీకోసం...

celebrities
సెలబ్రిటీస్​

By

Published : May 5, 2020, 6:21 AM IST

Updated : May 5, 2020, 7:06 AM IST

స్టార్​ హీరోస్​... ఎవరైనా ఓ సినిమా చేశారంటే వాళ్ల రెమ్యునరేషన్​ కోట్లలో ఉంటుంది. ఇది మనకు తెలిసిన విషయమే. కానీ వారు సినీ కెరీర్​ ప్రారంభించకముందుకు.. వాళ్ల జీవనోపాధి కోసం తొలిసారిగా ఎంచుకున్న కెరీర్​ ఏంటి? తొలి జీతం ఎంత తీసుకున్నారు? ఎవరికైనా తెలుసా? బహుశ ఎవరికీ తెలిసి ఉండకపోవచ్చు. వాటి గురించి విశేషాలు మీకోసం.

అమితాబ్​ బచ్చన్​

కోల్​కతాలోని ఓ కంపెనీలో మేనేజింగ్​ ఎగ్జిక్యూటివ్​గా పనిచేశారు. అప్పుడు ఆయన అందుకున్న తొలి జీతం రూ.500. ప్రస్తుతం 'బటర్​ఫ్లై', 'గులాబో సితాబో', 'ఝండ్​', 'చెహ్రే', 'బ్రహ్మస్త్ర' అనే చిత్రాల్లో నటిస్తున్నారు.

అమితాబ్​ బచ్చన్​

షారుఖ్​ ఖాన్​

బాలీవుడ్​ బాద్​షా షారుఖ్ ఖాన్​​... సినీమాల్లోకి రాకముందు ఓ గైడ్​గా పనిచేశాడు. అతడు అందుకున్న తొలి జీతం రూ.50. ఈ జీతంతో షారుఖ్​ తన కుటుబంతో ఆగ్రా తాజ్​మహాల్​ చూశాడు. చివరిసారిగా 'జీరో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

షారుఖ్​

హృతిక్​రోషన్​

బాలీవుడ్​లో 'కహోనా ప్యార్​ హే' సినిమాతో హీరో ఎంట్రీ ఇచ్చిన హృతిక్​రోషన్​... బాలనటుడిగా పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. అందులో భాగంగా 1980లో వచ్చిన 'ఆషా' సినిమాలో నటించినందుకు రూ.100 తీసుకున్నాడు. చివరిసారిగా 'వార్'​ సినిమాలో నటించాడు. ప్రస్తుతం కొత్త కథలను వింటున్నాడు.

హృతిక్​రోషన్​

ప్రియాంక చోప్రా

2000 సంవత్సరం తన 17ఏళ్ల వయసులో 'మిస్​ వరల్డ్​' టైటిల్​ను గెలుచుకుంది. అప్పుడు తాను చెక్​ రూపాన రూ.5వేల నగదు బహుమతి గెలుచుకుంది. అదే తను తొలి సారిగా అందుకున్న జీతం. ప్రస్తుతం 'వి కెన్​ బి హీరోస్'​, 'ది మ్యాట్రిక్స్​ 4', 'ది వైట్​ టైగర్​' సినిమాల్లో నటిస్తుంది.

ప్రియాంక చోప్రా

అమీర్​ఖాన్​

బాలీవుడ్​ మిస్టర్​ పర్​ఫెక్ట్​ 'అమీర్​ఖాన్'​ తన తొలి సినిమా 'క్యామత్​ సే క్యామత్ తక్'​. ఈ సినిమా షూటింగ్ ​ 11నెలల పాటు జరిగింది. ఈ సినిమాలో నటించినందుకు ప్రతి నెల వెయ్యి రూపాయలు చొప్పున జీతం తీసుకున్నాడు. ప్రస్తుతం 'లాల్​ సింగ్​ చద్ధా' సినిమాలో నటిస్తున్నాడు.

అమీర్​ఖాన్​

సోనమ్​ కపూర్​

బాలీవుడ్​ హీరోయిన్​ సోనమ్​కపూర్​ తన 15వ ఏటా చదువుకుంటూనే వెయిటర్​గా పనిచేసింది. ఆ తర్వాత ఓ బాలీవుడ్​ దర్శకుడు వద్ద అసిస్టెంట్​గా పనిచేస్తూ నెలకు రూ. 3వేల జీతం అందుకుంది. చివరిసారిగా 'ది జోయా ఫ్యాక్టర్'​ సినిమాతో అలరించింది. ప్రస్తుతం కొత్త చిత్రాల కథలు వింటుంది.

సోనమ్​కపూర్​

కార్తీక్​ ఆర్యన్​

బాలీవుడ్​ హీరో కార్తీక్​ ఆర్యన్​.. తాను కాలేజ్​ చదువుతున్నప్పుడే 'ప్యార్​ కా పంచ్​నామా'(2011)సినిమాలో నటించాడు. ఇందుకుగానూ తొలిసారిగా రూ.13వేల రూపాయల చెక్​ అందుకున్నాడు. ప్రస్తుతం 'భూల్​ భూలయ్యా 2', 'దోస్తానా 2' సినిమాల్లో నటిస్తున్నాడు.

కార్తీక్​ ఆర్యన్​
Last Updated : May 5, 2020, 7:06 AM IST

ABOUT THE AUTHOR

...view details