సినీ నటులు ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ (Iffm awards 2021) ఒకటి. 2021 సంవత్సరానికి సంబంధించిన అవార్డుల్ని ఐ.ఎఫ్.ఎఫ్.ఎం తాజాగా ప్రకటించింది. దక్షిణాది నుంచి కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, ప్రముఖ టాలీవుడ్ నటి సమంత ఉత్తమ నటులుగా అవార్డులు గెలుచుకున్నారు. ఇటీవల అమెజాన్ ప్రైంలో విడుదలైన 'సూరరై పొట్రు' (ఆకాశం నీ హద్దురా) ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఇందులో నటనకుగాను సూర్య ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఉత్తమ వెబ్‌సిరీస్‌గా 'ఫ్యామిలీ మ్యాన్' నిలిచింది. ఈ సిరీస్‌లో విలన్‌గా నటించిన సమంత ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది.
Iffm award : సూర్య, సమంతకు అంతర్జాతీయ పురస్కారం
తొలిసారి వెబ్ సిరీస్‌లో నటించి అదరగొట్టిన సమంతను అంతర్జాతీయ అవార్డు వరించించింది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్లో (Iffm awards 2021) ఆమెకు అవార్డు దక్కింది. కోలీవుడ్ నుంచి స్టార్ హీరో సూర్య కూడా ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్నారు.
సమంత
బాలీవుడ్ నుంచి ఉత్తమ నటిగా విద్యాబాలన్ (షేర్నీ), ఉత్తమ నటుడిగా మనోజ్ బాజ్‌పాయ్ (వెబ్ సిరీస్/ఫ్యామిలీమ్యాన్ 2) అవార్డులను అందుకున్నారు. 'లూడో' చిత్రానికిగాను ఉత్తమ దర్శకుడిగా అనురాగ్ బసు నిలిచారు. ఉత్తమ డాక్యుమెంటరీగా 'షటప్ సోనా', ఉత్తమ వెబ్‌సిరీస్‌గా 'మీర్జాపుర్ 2' నిలిచాయి. మొత్తం 27 భాషలకు చెందిన 120కిపైగా చిత్రాలు పోటీలో నిలిచాయి.
ఇవీ చదవండి:
Last Updated : Aug 20, 2021, 5:30 PM IST