తెలంగాణ

telangana

By

Published : Dec 19, 2019, 12:26 PM IST

ETV Bharat / sitara

తిరుమల సందర్శనలో హీరోయిన్ సమంత

హీరోయిన్ సమంత... నడకదారిలో తిరుమల చేరుకొని, వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. ఈమెతో పాటు నటి రమ్య ఉంది.

తిరుమల సందర్శనలో హీరోయిన్ సమంత
నటి రమ్యతో హీరోయిన్ సమంత

స్టార్ హీరోయిన్ సమంత.. ఈ ఏడాదిని ఘనంగా ముగించింది. 'మజిలీ'లో గృహిణిగా అలరించింది. 'ఓ బేబీ'లో అద్భుత నటనతో అదరగొట్టేసింది. కింగ్ నాగార్జున 'మన్మథుడు 2'లో అతిథి పాత్రలో మెరిసింది. తమిళంలో వచ్చిన 'సూపర్​ డీలక్స్​'లోనూ మెప్పించే ప్రదర్శన చేసింది. ఇవన్నీ బాక్సాఫీస్​ దగ్గర హిట్​ టాక్​ అందుకున్నాయి.

ఈ ఏడాదిని విజయవంతంగా పూర్తి చేసుకున్న సమంత.. బుధవారం రాత్రి మెట్ల మార్గంలో తిరుమల చేరుకుంది. ఈమెతో పాటు నటి రమ్య ఉంది. వీరిద్దరూ గురువారం ఉదయం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆ ఫొటోలను సోషల్​ మీడియాలో పంచుకున్నారు.

తిరుమల మెట్ల మార్గంలో హీరోయిన్ సమంత- నటి రమ్య
హీరోయిన్ సమంత- నటి రమ్య

ఇది చదవండి: సామ్-చైతూ ఐదోసారి.. 'గీత గోవిందం' లాంటి కథతో!

ABOUT THE AUTHOR

...view details