తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఈద్​'కు వస్తోన్న సల్మాన్​​.. దర్శకుడు అతడే..! - radhe cinema

కండలవీరుడు సల్మాన్​ఖాన్.. తర్వాతి​ సినిమాకు ప్రభుదేవా దర్శకత్వం వహించనున్నాడు. వచ్చే ఏడాది ఈద్​కు ప్రేక్షకుల ముందుకు రానుంది.

హీరో సల్మాన్​ఖాన్

By

Published : Sep 25, 2019, 8:35 PM IST

Updated : Oct 2, 2019, 12:28 AM IST

బాలీవుడ్ హీరో సల్మాన్​ఖాన్​..ప్రస్తుతం 'దబాంగ్-3' షూటింగ్​లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా దర్శకుడు ప్రభుదేవా.. ఇదే కథానాయకుడితో మరో చిత్రం తీసేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని సల్మాన్​ ధ్రువీకరించాడు. వచ్చే ఏడాది ఈద్​కు మరో చిత్రంతో రాబోతున్నట్లు ప్రకటించాడు.

"మేం (ప్రభుదేవా-నేను) మరో సినిమా చేస్తున్నాం. వచ్చే ఏడాది 'ఈద్'​కు రాబోతున్నాం. అయితే ఈ చిత్రం పేరు 'రాధే' కాదు". -సల్మాన్​ఖాన్, కథానాయకుడు.

ఇంతకు ముందు 'ఇన్షాల్లా' సినిమాను వచ్చే ఏడాది 'ఈద్'​కు తెస్తున్నట్లు చెప్పాడు సల్మాన్​ఖాన్. కానీ సాంకేతిక కారణాల వల్ల అనుకున్న సమయానికి రాలేకపోతున్నామని ఇటీవలే వెల్లడించాడు.

దబాంగ్-3 సినిమాలో సల్మాన్​ఖాన్

ప్రభుదేవా తెరకెక్కించే సినిమా కొరియన్ చిత్రం 'వెటరన్'కు రీమేక్​గా తెరకెక్కనుందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

ఇది చదవండి: కాస్త వినూత్నంగా అమితాబ్​ బచ్చన్​కు శుభాకాంక్షలు

Last Updated : Oct 2, 2019, 12:28 AM IST

ABOUT THE AUTHOR

...view details