సల్మాన్‌ఖాన్ ఓ తమిళ చిత్రం హిందీ రీమేక్‌లో నటింబోతున్నాడు అని అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. విజయ్ కథానాయకుడిగా నటించిన తమిళ చిత్రం 'మాస్టర్'. విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం ఓటీటీ ద్వారా విడుదలై ప్రేక్షకారణ పొందింది. ఈ చిత్రాన్ని ఎండెమోల్ షైన్ ఇండియా, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్, నిర్మాత మురాద్ భేతానీ కలిసి హిందీలో నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ నటింబోతున్నట్లు సమాచారం. సల్మాన్ 'మాస్టర్' చిత్రాన్ని చూసి, రీమేక్‌లో నటించడానికి అంగీకారం కూడా తెలిపారట.
లాక్డౌన్ కారణంగా ఈ సినిమా వ్యవహారాలు కొన్ని రోజులుగా ఆగిపోయాయి. ఇప్పుడు ఈ కొత్త చిత్రానికి సంబంధించిన సన్నాహాలు మళ్లీ మొదలయ్యాయి. ఈ చిత్రం ఎప్పుడు మొదలవుతుంది? దర్శకుడు ఎవరు? లాంటి విషయాలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. 'రాధే' చిత్రంతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన సల్మాన్ ప్రస్తుతం 'అంతిమ్', 'టైగర్ 3', 'కబీ ఈద్ కబీ దివాలీ', 'కిక్ 2' చిత్రాల్లో నటిస్తున్నాడు. జులైలో 'మాస్టర్' రీమేక్ తో పాటు మరో భారీ చిత్రానికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది.