తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అప్పుడు వీరప్రేమికుడిగా- సీక్వెల్​లో తండ్రిగా!

'లవ్​ ఆజ్​ కల్'​ సినిమాలో ప్రేమికుడిగా అలరించిన బాలీవుడ్​ స్టార్​ సైఫ్​ అలీఖాన్​ అదే చిత్రం సీక్వెల్​లో తండ్రి పాత్ర పోషించనున్నాడు. ఈ సినిమాలో కూతురు సారా , కార్తీక్​ ఆర్యన్​లతో కలిసి సైఫ్​ నటిస్తుండటం విశేషం.

'లవ్​ ఆజ్​ కల్​ 2'లో తండ్రిగా సైఫ్​​.!

By

Published : Apr 2, 2019, 3:09 PM IST

కార్తీక్​ ఆర్యన్​, సారా అలీఖాన్​ జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'లవ్​ ఆజ్​ కల్ ​2'. ఈ సినిమా సీక్వెల్​కు ఇంతియాజ్​ అలీ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే మొదటి పార్ట్​లో దీపికా పదుకునే ప్రేమికుడిగా మెప్పించిన సైఫ్​.. ఈ భాగంలో మాత్రం హీరో లేదా హీరోయిన్​కు తండ్రిగా కనిపించనున్నాడు. నిజ జీవితంలో సారా అలీఖాన్​కు తండ్రి అయిన సైఫ్ వీరిద్దరితో కలిసి ఎలా నటిస్తాడోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.

ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవం రోజున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇప్పటివరకు సారా, కార్తీక్​ జంటగా ఏ చిత్రంలోనూ నటించలేదు. కానీ వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని చాలా వార్తలు వచ్చాయి. కార్తీక్​ చివరిగా కృతి సనన్​తో కలిసి 'లూకా చుప్పీ' సినిమాలో కనిపించగా.. సారా ఇటీవల విడుదలైన రణ్​వీర్​ సింగ్​ 'సింబా'లో సందడి చేసింది.

సారా అలీఖాన్​, కార్తీక్​ ఆర్యన్​

ABOUT THE AUTHOR

...view details