తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Karthikeya Engagement: యువ హీరో కార్తికేయకు నిశ్చితార్థం - RX 100 Karthikeya news

తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న హీరో కార్తికేయకు(hero karthikeya) నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

Karthikeya Engaged
హీరో కార్తికేయ

By

Published : Aug 23, 2021, 10:39 AM IST

Updated : Aug 23, 2021, 11:31 AM IST

'ఆర్‌ఎక్స్ 100' ఫేమ్‌(RX 100 hero) హీరో కార్తికేయ ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఫంక్షన్‌ హాల్‌లో ఆయన నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు వధూవరుల కుటుంబ సభ్యులతోపాటు అతి తక్కువ మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు కార్తికేయ నిశ్చితార్థానికి హాజరై అభినందనలు తెలిపారు. నిశ్చితార్థానికి సంబంధించిన ఓ ఫొటో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. దీంతో నెటిజన్లు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు కార్తికేయ మనువాడబోయే అమ్మాయికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సినీరంగంపై ఆసక్తితో కార్తికేయ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 2017లో విడుదలైన 'ప్రేమతో మీ కార్తీక్‌' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమా అనుకున్నంతగా విజయాన్ని అందించలేకపోయింది. అనంతరం 'ఆర్‌ఎక్స్‌ 100' ఆయనకు సూపర్‌హిట్‌ అందించింది. కేవలం హీరో రోల్స్‌ మాత్రమే కాకుండా ప్రతినాయకుడిగాను ఆయన మెప్పిస్తున్నారు. నాని 'గ్యాంగ్‌లీడర్‌'లో కార్తికేయ విలన్‌గా నటించారు. అజిత్‌ 'వాలిమై'లో(ajith valimai) కీలకపాత్ర పోషిస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Aug 23, 2021, 11:31 AM IST

ABOUT THE AUTHOR

...view details