తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బన్నీతో నటన చాలా సులభం: రష్మిక - rashmika allu arjun

'పుష్ప' షూటింగ్ అనుభవాల్ని పంచుకుంది హీరోయిన్ రష్మిక. కేవలం నాలుగు గంటలే నిద్రపోతున్నానని, బన్నీతో తన కెమిస్ట్రీ అద్భుతమని పేర్కొంది.

rashmika mandanna about Pushpa movie shooting
బన్నీతో నటన చాలా సులభం: రష్మిక

By

Published : Feb 10, 2021, 11:29 AM IST

అల్లు అర్జున్‌, రష్మిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'పుష్ప'. సుకుమార్‌ దర్శకుడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ సాగుతోంది. ఈ ఏడాది ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల 'పుష్ప' చిత్రీకరణ‌ గురించి మాట్లాడిన రష్మిక.. పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. అల్లు అర్జున్​తో కలిసి పనిచేయడం ప్రత్యేకమని చెప్పింది. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని స్పష్టం చేసింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని, బన్నీతో కలిసి నటించడం సులభమేనని రష్మిక తెలిపింది.

హీరోయిన్ రష్మిక

"ఇప్పటివరకూ నేను చేసిన చిత్రాల్లో 'పుష్ప' ఎంతో విభిన్నమైన చిత్రం. సుదూర ప్రాంతాల్లో చిత్రీకరణ కారణంగా ఎన్నో సవాళ్లు‌ ఎదుర్కొంటున్నాను. తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి లొకేషన్‌కు చేరుకుంటున్నాం. మళ్లీ ఇంటికి వచ్చేసరికి రాత్రి 10 అవుతోంది. భోజనం, వర్కౌట్లు చేసి నిద్రపోయేసరికి 12 నుంచి ఒంటిగంట అవుతోంది. దానివల్ల కేవలం నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతున్నాను. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మీరు స్ర్కీన్‌పై చూస్తారు" అని రష్మిక చెప్పింది.

ఈ సినిమాలో హీరో హీరోయిన్ల మేకప్‌ చాలా కీలకమైందని.. దీని కోసమే రెండు గంటలు కేటాయించాల్సి వస్తోందని ఆమె వివరించారు.

పుష్ప రిలీజ్ డేట్ పోస్టర్

ABOUT THE AUTHOR

...view details