పెళ్లి వయసొచ్చిన కొడుకు ఉన్న దంపతులు మళ్లీ ఓ పాపాయికి జన్మనిస్తే ఎలా ఉంటుందనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం 'బదాయి హో'. ఆయుష్మాన్ ఖురానా ప్రధానపాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం విడుదలై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా దీన్ని నిర్మించిన జంగిల్ పిక్చర్స్ 'బదాయి దో' పేరుతో మరో చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తుంది. ఇందులో రాజ్‌కుమార్ రావ్, భూమి పెడ్నేకర్ జంటగా నటించనున్నారు. హర్షవర్ధన్ కులకర్ణి దీనికి దర్శకత్వం వహించనున్నారు.
మహిళా పోలీస్ స్టేషన్లో ఒకే ఒక్కడు - భూమి పెడ్నేకర్ వార్తలు
'బదాయి హో' చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న జంగిల్ బుక్ సంస్థ.. ప్రస్తుతం 'బదాయి దో' అనే సినిమాను నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో రాజ్‌కుమార్ రావ్, భూమి పెడ్నేకర్ ప్రధానపాత్రల్లో నటించనున్నారు.

మహిళా పోలీస్ స్టేషన్లో ఒకేఒక్క మగ పోలీసు
ఓ మహిళా పోలీస్ స్టేషన్లో పనిచేసే ఒకేఒక్క మగ పోలీస్ పాత్రలో రాజ్‌కుమార్ రావ్ పాత్ర ఉండబోతోంది. పీఈటీ టీచర్‌గా భూమి పెడ్నేకర్ నటించనున్నారు. పూర్తిస్థాయి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.