సూపర్‌స్టార్ రజనీకాంత్.. ప్రస్తుతం తన 168వ సినిమాలో నటిస్తున్నాడు. శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఖుష్బూ, మీనా హీరోయిన్లు. కీర్తి సురేశ్ రజనీ కూతురిగా కనిపించనుంది. సన్‌పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్‌ను తాజాగా ప్రకటించింది చిత్రబృందం.
రజనీ కొత్త సినిమా టైటిల్ ఖరారు - Rajnikat new movie title annaatthe
సూపర్‌స్టార్ రజనీకాంత్ కొత్త సినిమాకు టైటిల్ ఖరారు చేసింది చిత్రబృందం. తాజాగా టైటిల్‌తో కూడిన మోషన్ పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది.

రజనీ
రజనీ కొత్త సినిమాకు 'అన్నాత్తె' అనే పేరును ఖరారు చేశారు. ఈ టైటిల్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. 'అన్నాత్తె' అంటే సోదరుడు అని అర్థం. దీపావళికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
Last Updated : Mar 2, 2020, 12:17 PM IST