బాలీవుడ్ నటి రాధిక మదన్ ఆనందంతో ఉబ్బితబ్బిబైపోతుంది. ఇటీవలే విడుదలైన 'అంగ్రేజీ మీడియం'లో ఆమె నటనకుగానూ అమితాబ్ ప్రశంసలు కురిపించడమే ఇందుకు కారణం. స్వయంగా రాసిన లేఖతో పాటు బొకేను బిగ్‌బీ పంపారంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చిందీ ముద్దుగుమ్మ.
"అమితాబ్ దగ్గర నుంచి ప్రశంస లభించటం నా జీవితంలో మర్చిపోలేని రోజు. నాకు దక్కిన ఈ గౌరవానికి మాటలు రావటం లేదు. ప్రతి సినిమా విడుదల తర్వాత ఇలాంటి దానికోసం ఎదురుచూశాను. కానీ, ఈ రోజు నాకోసం అమితాబ్.. పువ్వులతో పాటు ఒక లెటర్‌ను పంపించారు అని తెలియగానే ఆనందంలో మునిగిపోయాను. కొంచెం ఉంటే కళ్లు తిరిగి పడిపోయేదాన్ని. కల నిజం చేసిందుకు ధన్యవాదాలు అమితాబ్ సార్"