'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైంది రాశీ ఖన్నా. కాస్త బొద్దుగా ఉండటం వల్ల అభిమానులంతా ముద్దుగా చబ్బీ అని పిలిచేవారు. కెరీర్ ప్రారంభంలో అలా ఉన్నా.. తర్వాత కొన్ని ప్రాజెక్టుల కోసం బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు సన్నగా నాజుగ్గా తయారవడానికి తనెంత కష్టపడిందో తెలియజేసేందుకు బికినీలో దర్శనమిచ్చి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది ఈ భామ.
'హాట్' అని పిలిస్తే సంతోషిస్తా: రాశీ ఖన్నా
హీరోయిన్ రాశీఖన్నా కెరీర్ ప్రారంభంలో బొద్దుగా ఉన్నా.. తర్వాత నాజుగ్గా తయారైంది. తనను హాట్ అని పిలిస్తే ఇష్టమని అంటోందీ నటి.
ఈ విషయంపై.. "రాశీ నిన్ను ఇలా చూడలేకపోతున్నాం" అంటూ కొందరు నెటిజన్లు కామెంట్ చేయగా మరికొందరు "ఇంత నాజుగ్గా అవడానికి ఎంత కష్టపడ్డారో" అని వ్యాఖ్యానించారు. ఇది గుర్తిస్తారనే ఈ పోస్ట్ పెట్టానని చెప్పుకొచ్చింది రాశి. అంతేకాదు ఆమెకు హాట్ అని పిలిస్తేనే ఇష్టమట. "హాట్ అంటే ఎవరికైనా కోపం వస్తుంది. నాకు కోపం కాదు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ‘చబ్బీ చబ్బీ’ అంటే విసుగొస్తుంది. రంగుల ప్రపంచంలో హాట్ అనే పదం తప్పు కాదు" అంటుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ఓ సినిమా, 'వెంకీమామ', 'ప్రతిరోజూ పండగే' చిత్రాలతో బిజీగా ఉంది.
ఇవీ చూడండి.. అక్కడ 'బాహుబలి'ని బీట్ చేసిన 'సాహో'