తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పండగ సెట్లో నవ్వులే నవ్వులు.. మీరూ చూసేయండి

మెగా హీరో సాయితేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'ప్రతిరోజూ పండగే'. శుక్రవారం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మేకింగ్ వీడియోను అభిమానులతో పంచుకుంది చిత్రబృందం.

prathiroju
ప్రతిరోజూ

By

Published : Dec 21, 2019, 8:05 PM IST

మెగామేనల్లుడు సాయితేజ్‌ కథానాయకుడిగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ప్రతిరోజూ పండగే'. రాశీఖన్నా కథానాయిక. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్‌ను అందుకుంది. కుటుంబ ప్రేక్షకులను అలరించేలా దర్శకుడు మారుతీ ఈ సినిమాను తీర్చిదిద్దాడు. ముఖ్యంగా హస్య సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాయి. రావు రమేష్‌, సత్యరాజ్‌ పాత్రలను తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుంటోంది.

తాజాగా 'ప్రతిరోజూ పండగే' మేకింగ్‌ వీడియోను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. సాయితేజ్‌-రాశీఖన్నాల మధ్య మేకింగ్‌ సన్నివేశాలతో పలు షూటింగ్‌ సమయంలో చోటు చేసుకున్న జ్ఞాపకాలతో ఈ వీడియోను రూపొందించారు. దీనిపై మీరూ లుక్కేయండి.

ఇవీ చూడండి.. కంగనా కూతకి వస్తోంది.. కాచుకోండి

ABOUT THE AUTHOR

...view details