Prabhas Salar shooting break: ఇటీవలే 'రాధేశ్యామ్'తో అభిమానుల ముందుకు వచ్చిన ప్రభాస్.. ప్రస్తుతం మరిన్ని భారీ బడ్జెట్ చిత్రాల్లోనూ నటిస్తున్నారు. అందులో సలార్ ఒకటి. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు నిరుత్సాహ పరిచే వార్త ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. 'రాధేశ్యామ్' రిలీజ్ తర్వాత ప్రభాస్ ఓ చిన్న సర్జరీ కోసం విదేశాలకు వెళ్లారు. పూర్తిగా కోలుకోవడానికి కనీసం రెండు నెలలు పడుతుందట! అందుకే ఈ సినిమా షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారని టాక్. ఇక ఈ సినిమా విషయాన్ని కొస్తే.. 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండగా.. శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికీ ఈ సినిమా 30శాతం వరకు చిత్రీకరణ పూర్తిచేస్తుకుందని తెలుస్తోంది.
Rasikhanna Shocking comments: 'రుద్ర'తో తొమ్మిదేళ్ల తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి, అక్కడ మొదటి విజయాన్ని అందుకున్నారు నటి రాశీఖన్నా. ప్రస్తుతం 'రుద్ర' సక్సెస్‌తో ఆనందంలో ఉన్న రాశీఖన్నా బాలీవుడ్ మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ‘రుద్ర’ కోసం అజయ్ దేవ్‌గణ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె చెప్పారు. ఇంటర్వ్యూల్లో భాగంగా ఆమె దక్షిణాది చిత్రపరిశ్రమపై షాకింగ్ కామెంట్స్ చేశారు. దక్షిణాదిలో కేవలం నటీమణుల అందాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుని సినిమాలు ఆఫర్ చేస్తారని వ్యాఖ్యానించారు.