తెలంగాణ

telangana

By

Published : May 19, 2021, 10:30 AM IST

ETV Bharat / sitara

వేడుకలు ఆరోజు జరుపుకొందాం: ఎన్టీఆర్

టాలీవుడ్​ స్టార్​ హీరో జూనియర్​ ఎన్టీఆర్​.. మే20న తన పుట్టినరోజు వేడుకలు జరపవద్దని అభిమానుల్ని కోరారు. ఇంటివద్దనే ఉండి కరోనా జాగ్రత్తలు పాటించాలని కోరారు. వైరస్​ బారిన పడి ప్రాణాలు వదిలిన వారి కుటుంబాలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

ntr
ఎన్టీఆర్​ రిక్వెస్ట్​

టాలీవుడ్ యంగ్​ టైగర్​ జూనియర్​ ఎన్టీఆర్ అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశారు. కరోనా కాలంలో ఎవరూ తన పుట్టినరోజు వేడుకలు(మే 20) చేయొద్దని కోరారు. ఇంటివద్దనే ఉండి లాక్ డౌన్, కర్ఫ్యూ నిబంధనలను పాటించాలని సూచించారు. ప్రాణాలు, జీవనోపాధి కోల్పోయిన వారి కుటుంబాలకు అండగా నిలబడాలని పేర్కొన్నారు. ప్రపంచం కరోనాను జయించిన రోజు అందరం కలిసి వేడుకల్ని జరుపుకొందాం అని పిలుపునిచ్చారు.

ఎన్టీఆర్​ రిక్వెస్ట్​

కరోనా నుంచి కోలుకుంటున్నట్లు తెలిపిన తారక్.. త్వరలోనే వైరస్​ను జయిస్తానని అన్నారు. ప్రస్తుతం ఆయన 'ఆర్​ఆర్​ఆర్'​లో నటిస్తున్నారు. ఆ తర్వాత కొరటాల శివతో ఓ సినిమా చేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details