ప్రియాంక చోప్రా భర్త నిక్ జొనాస్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం 'మిడ్‌వే'. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇండిపెండెన్స్ డే, 2012 లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన రొనాల్డ్ ఎమ్మరిచ్ ఈ చిత్రానికి దర్శకుడు.
యుద్ధ విమానాల నిర్వహణను పర్యవేక్షించే బ్రూనో గైడో అనే అధికారిగా నిక్ జొనాస్ కనిపించనున్నాడు. తాజాగా విడుదలైన నిక్ ఫస్ట్‌లుక్ ఆకట్టుకుంటోంది. నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. విదేశాలతో పాటు భారత్‌లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.