హీరో నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'వైల్డ్‌డాగ్'. అహిసోర్ సాల్మన్ దర్శకుడు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. ఏప్రిల్ 2న రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది.
'వైల్డ్ డాగ్' రిలీజ్ ఫిక్స్.. 'దృశ్యం 2' షురూ
హీరో నాగార్జున నటిస్తున్న 'వైల్డ్ డాగ్' సినిమాను ఈ ఏడాది ఏప్రిల్ 2న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. వెంకటేశ్ ప్రధాన పాత్రలో తెలుగులో తెరకెక్కిస్తున్న దృశ్యం-2 చిత్రీకరణ ప్రారంభమైంది.
'వైల్డ్ డాగ్'
'దృశ్యం 2' తెలుగులో అలరించేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా చిత్రీకరణను లాంఛనంగా ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది చిత్రబృందం. తొలి భాగంలో అలరించిన హీరో వెంకటేశ్-మీనా జోడీయే ఇందులోనూ నటిస్తున్నారు.
ఇదీ చూడండి: 'ఆచార్య' చెర్రీ లుక్-సుధీర్ కొత్త సినిమా టైటిల్ ఖరారు
Last Updated : Mar 1, 2021, 5:55 PM IST