తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మరోసారి శ్రద్ధాకపూర్, టైగర్ ష్రాఫ్ జోడీ - tiger sraff

శ్రద్ధా కపూర్, టైగర్ ష్రాఫ్ మరోసారి కలిసి నటించనున్నారు. బాఘీ 3 సినిమా కోసం వీరు కలిసి పనిచేయనున్నారు.

శ్రద్ధా కపూర్, టైగర్ ష్రాఫ్

By

Published : Feb 12, 2019, 8:06 PM IST

బాలీవుడ్​లో విజయవంతమైన జంట టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్ జంట మరోసారి కలిసి నటించనుంది. మొదటి బాఘీ చిత్రంలో కూడా వీరు కలిసి నటించారు.

"సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. 'బాఘీ' కుటంబంతో మరోసారి కలుస్తున్నందుకు ఆనందంగా ఉంది. నిర్మాత షాజిద్​తో నాకు ఇది మూడో సినిమా, టైగర్ ష్రాఫ్​తో రెండోది, దర్శకుడు అహ్మద్ ఖాన్​తో మొదటి చిత్రం " -శ్రద్ధాకపూర్

'బాఘీ 2' కి దర్శకత్వం వహించిన కొరియోగ్రాఫర్, డైరక్టర్ అహ్మద్ ఖాన్ ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు.

'బాఘీ' ఫ్యామిలీకి శ్రద్ధా తిరిగి వస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇద్దరి జంట చాలా బాగుంటుంది. ఈ చిత్రం మరోసారి అభిమానుల్ని అలరించడం ఖాయమని చిత్ర నిర్మాత షాజిద్ నదియావాలా తెలిపారు.

ప్రస్తుతం శ్రద్ధా 'చిచ్చోరే', 'స్ట్రీట్ డాన్సర్' చిత్రాల్లో నటిస్తోంది. 'బాఘీ 3'ని మార్చి 2020లో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details