తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'కంగనాపై వస్తున్న వార్తల్లో నిజం లేదు' - prakash

'మెంటల్ హై క్యా' చిత్ర కథలో కంగనా రనౌత్​ కలగజేసుకుంటోందని వస్తున్న వార్తల్లో నిజం లేదని దర్శకుడు ప్రకాశ్ కోవెలమూడి తెలిపాడు. సినిమా బాగా వస్తోందని, ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని చెప్పాడు. జులై 26న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

కంగనా

By

Published : Jun 7, 2019, 8:19 PM IST

కంగనా రనౌత్​ 'మెంటల్ హై క్యా' సినిమా కథలో కలగజేసుకుంటోందని వస్తున్న వార్తలను ఖండించాడు ఆ చిత్ర దర్శకుడు ప్రకాశ్ కోవెలమూడి. ఇవన్నీ నిరాధార వదంతులంటూ కొట్టిపారేశాడు. చిత్రంలోని కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేయాలని కంగనా భావిస్తున్నట్లు కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి.

"రాజ్​కుమార్ ​రావు, కంగనా ప్రొఫెషనల్ నటులు. వారితో కలిసి పనిచేయడాన్ని ఆస్వాదిస్తున్నాను. సినిమా చాలా బాగా వస్తోంది. మొదటి షెడ్యూల్ ముంబయి, రెండో షెడ్యూల్ లండన్​లో పూర్తి చేశాం. చివరి షెడ్యూల్ గత నెలలో మొదలుపెట్టాం. కంగనాపై వస్తున్న వార్తల్లో నిజం లేదు" -ప్రకాశ్ కోవెలమూడి, దర్శకుడు

శోభా కపూర్, ఏక్తాకపూర్ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. జులై 26న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ABOUT THE AUTHOR

...view details