మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్లోని మహిళల భద్రత కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు 'మా' అధ్యక్షుడు(maa president 2021) మంచు విష్ణు(manchu vishnu maa president) వెల్లడించారు. ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ప్రజ్వల ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు పద్మశ్రీ సునీతా కృష్ణన్ ముఖ్య సలహాదారుగా ఉమెన్ ఎంపవర్‌మెంట్, గ్రీవెన్స్ సెల్ ఉంటుందని తెలిపారు. ఈ కమిటీలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉంటారని పేర్కొన్న విష్ణు(manchu vishnu maa president).. వారి వివరాలు త్వరలోనే ప్రకటిస్తానని పేర్కొన్నారు. 'మా' అసోసియేషన్ మరింత బలంగా, జవాబుదారీగా ఉండటానికి ఈ కమిటీ దోహదపడుతుందని విష్ణు ఆశాభావం వ్యక్తం చేశారు.
'మా' మహిళా భద్రత కోసం కమిటీ: మంచు విష్ణు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్లోని మహిళల భద్రత కోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు(maa president 2021) మంచు విష్ణు(manchu vishnu maa president) తెలిపారు. ప్రముఖ సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్ ఈ కమిటీకి గౌరవ సలహాదారుగా ఉంటారని వెల్లడించారు.
విష్ణు
"ఉమెన్ ఎంపవర్‌మెంట్ అండ్ గ్రీవెన్స్ సెల్' పేరిట కమిటీని ఏర్పాటు చేశామని తెలియజేస్తున్నందుకు గర్వంగా ఉంది. మహిళా సాధికారత కోసం ఈ కమిటీ పనిచేస్తుంది. పద్మశ్రీ సునీతా కృష్ణన్ సలహాదారుగా పనిచేయనున్నారు. ఈ కమిటీలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. వారి వివరాలు త్వరలోనే తెలియజేస్తాం" అని విష్ణు తెలిపారు. 'మా'లో మరింత మంది మహిళలను భాగస్వాములను చేయడానికి ఈ కమిటీ ద్వారా తొలి అడుగు వేస్తున్నట్లు విష్ణు(manchu vishnu maa president) పేర్కొన్నారు.