తెలంగాణ

telangana

ETV Bharat / sitara

స్వప్నమై, సత్యమై, స్వర్గమైన ప్రేమ

నాగచైతన్య తాజా చిత్రం మజిలీలోని 'నా గుండెల్లో' పాట విడుదలైంది. చైతన్య, హీరోయిన్ దివ్యాంశ కౌశిక్​లతో రూపొందిన ఈ గీతం అలరిస్తోంది.

నాగచైతన్య-దివ్యాంశ

By

Published : Mar 14, 2019, 8:07 PM IST

మజిలీ చిత్రంలో మరో లిరికల్ పాట విడుదలైంది. నా గుండెల్లో అంటూ సాగే ఈ గేయం ప్రేక్షకుల్ని అలరిస్తోంది. గోపీసుందర్ సంగీతమందించగా, యాజిన్ నిజార్, నిఖితా గాంధీ ఆలపించారు. రాంబాబు గోసాలా సాహిత్యాన్నందించారు. నాగచైతన్య, సమంత, దివ్యాంశ కౌషిక్ నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే విడుదలైన రెండు పాటలు సంగీతప్రియుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. నాగచైతన్య, దివ్యాంశ కౌశిక్​లపై తీసిన ఈ యుగళ గీతం యువతకు ఆకట్టుకుంటోంది. ప్రేమే స్వప్నమై, సత్యమై, స్వర్గమై పోనీ అంటూ సాగే సాహిత్యంతో మనసును హత్తుకుంటోంది.

వివాహం తర్వాత మొదటిసారిగా నాగచైతన్య, సమంత కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. 'నిన్నుకోరి'తో మెప్పించిన శివనిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సాహూ గారపాటి నిర్మిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details