తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హాస్యభరితంగా 'మేడిన్ చైనా' ట్రైలర్ - రాజ్​కుమార్ రావు

బాలీవుడ్​ విలక్షణ నటుడు రాజ్​కుమార్ రావు ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'మేడిన్ చైనా'. ఈ చిత్ర ట్రైలర్​ బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్టోబర్​ 25న విడుదల కానుందీ చిత్రం.

హాస్యభరితంగా 'మేడిన్ చైనా' ట్రైలర్

By

Published : Sep 18, 2019, 4:48 PM IST

Updated : Oct 1, 2019, 2:06 AM IST

రాజ్​కుమార్ రావు, మౌనీ రాయ్​ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'మేడిన్ చైనా'. బుధవారం ట్రైలర్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాలో రాజ్​.. తన పాత్ర కోసం దాదాపు 8 కిలోలకు పైగా బరువు​ పెరిగాడని చెప్పాడు దర్శకుడు మికిల్​.

"రాజ్​కుమార్​ రావు.. ఇందులో రఘ మోహతా అనే పాత్రలో నటించాడు. ఈ క్యారెక్టర్​ కోసం శరీరాకృతిని మార్చుకున్న విధానం నన్ను ఆశ్చర్యపరిచింది".
-- మికిల్ ముసాలే, దర్శకుడు

గుజరాత్​కు చెందిన వ్యాపారవేత్తగా రాజ్​ కనిపించగా.. అతడి భార్య రుక్మిణి పాత్రలో మౌనీ సందడి చేసింది. వినూత్నమైన ఆలోచనలతో హీరో ఏ విధంగా గొప్ప స్థాయికి ఎదిగాడన్నదే కథాంశం. తనదైన తెలివితేటలతో చైనాలోనూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాడనేది ఆసక్తికరంగా ఉంటుందని దర్శకుడు తెలిపాడు.

ఇందులో అమైర్ దస్తూర్, బొమన్ ఇరానీ, పరేశ్​ రావల్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. అక్టోబర్​ 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చదవండి...

Last Updated : Oct 1, 2019, 2:06 AM IST

ABOUT THE AUTHOR

...view details