స్వీటీ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'నిశ్శబ్దం'. సంగీతం ప్రధానాంశంగా తెరకెక్కిస్తున్నారు. దసరా సందర్భంగా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న మాధవన్ లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. 'ఆంటోని.. ఓ సెలబ్రిటీ మ్యూజీషియన్' అంటూ క్యాప్షన్ జోడించింది.
సెలబ్రిటీ సంగీతకారుడిగా మాధవన్..! - నిశ్శబ్దంలో అనుష్క లుక్
నిశ్శబ్దం సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న మాధవన్ ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఇప్పటికే వచ్చిన అనుష్క ఫొటో చిత్రంపై ఆసక్తి రేపుతోంది.

నిశ్శబ్దం సినిమాలో మాధవన్
ఈ సినిమాలో మైఖేల్ మ్యాడ్సన్, అంజలి, షాలినీ పాండే ఇతర పాత్రలు పోషిస్తున్నారు. గోపీసుందర్ సంగీతమందిస్తున్నాడు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.
ఇది చదవండి: 'నిశ్శబ్దం'లో అనుష్క లుక్: ఆమె మాట్లాడలేకపోవచ్చు... కానీ చేతులు..!