తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హాట్​ డ్యాన్స్​తో హల్​చల్​ చేస్తోన్న గాట్లీబ్ - lauren gottlieb hot dance

బాలీవుడ్​ సినిమా ఏబీసీడీ-ఎనీ బడీ కెన్​ డ్యాన్స్​లో నటించిన లారెన్​ గాట్లీబ్​ మరోసారి తనదైన నృత్యంతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇటీవల టాప్​లెస్​ ఫొటోలతో రచ్చ చేసిన ఈ అమ్మడు...మరోసారి ఓ హాట్​ డ్యాన్స్​తో అలరించింది.

హాట్​ డ్యాన్స్​తో హల్​చల్​ చేస్తోన్న గాట్లీబ్

By

Published : Sep 21, 2019, 5:31 AM IST

Updated : Oct 1, 2019, 10:00 AM IST

ప్రముఖ అమెరికన్‌ డ్యాన్సర్‌, నటి లారెన్‌ గాట్లీబ్‌ సోషల్​ మీడియాలో దుమ్ములేపుతోంది. ఇటీవల టాప్​లెస్​ ఫొటోలతో కనిపించిన ఈ భామ... తాజాగా ఓ డ్యాన్స్​ వీడియోతో సందడి చేస్తోంది.

శరీరానికి బిగుతైన దుస్తులు ధరించి శరీరాన్ని మెలికలు తిప్పుతూ చేస్తున్న ఈ డ్యాన్స్‌ కుర్రకారుకి మత్తెక్కించేలా ఉంది. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఈ అమ్మడు... "ప్రేమతో నడిచినట్లు.. అంతరిక్షంలో దొర్లిపో" అని పేర్కొంది.

గతంలో బాలీవుడ్​ చిత్రం ఏబీసీడీలో నటించింది గాట్లీబ్​. రెమో డిసౌజా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో.. ప్రభుదేవా, గణేష్​ ఆచార్యలతో కలిసి సందడి చేసింది. లారెన్‌ బాలీవుడ్‌లో 'వెల్‌కమ్‌ 2 కరాచీ', 'వెల్‌కమ్‌ బ్యాక్‌' అనే చిత్రాల్లో ప్రత్యేక పాత్రల్లో మెరిసింది.

Last Updated : Oct 1, 2019, 10:00 AM IST

ABOUT THE AUTHOR

...view details