తెలంగాణ

telangana

By

Published : Aug 26, 2020, 10:26 PM IST

ETV Bharat / sitara

షాహిద్​తో లవ్​, సైఫ్​తో పెళ్లి.. కరీనా సమాధానమిదే?​

హీరో షాహిద్​ కపూర్​తో విడిపోయాక.. సైఫ్​ అలీఖాన్​ను ఎలా పెళ్లి చేసుకుంది? అనంతరం కెరీర్​ ఎలా సాగింది? సహా పలు విషయాలను పంచుకుంది బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్ కరీనా కపూర్​. అవేంటో చూద్దాం.

kareena
కరీనా కెరీర్

బాలీవుడ్​ స్టార్ హీరోయిన్​ కరీనా కపూర్​.. వృత్తి, వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకుంటూ విజయవంతంగా సాగుతోంది. అయితే మాజీ ప్రియుడు, హీరో షాహిద్​ కపూర్​తో విడిపోయి.. సైఫ్​ అలీఖాన్​ను పెళ్లి చేసుకున్నాక తన జీవితం ఎలా మారింది? సైఫ్​తో ఎప్పుడు ప్రేమలో పడింది? తమ పెళ్లి విషయం తెలియగానే సన్నిహితులు ఏమన్నారు? సహా పలు విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిందీ బాలీవుడ్​ బెబో.

"షాహిద్​తో విడిపోయాక నేను నటించిన 'జబ్​ వి మెట్​' చిత్రం విడుదలై ఘన విజయం సాధించింది. దీంతో మంచి గుర్తింపు లభించింది. అదే సమయంలో సైఫ్​తో ప్రేమలో పడ్డాను. మేమిద్దరం పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకున్నాం. ఇదే విషయాన్ని నా సన్నిహితులతో చెప్పగా.. వారు ఆశ్చర్యపోయారు. 'కెరీర్​ మంఛి ఫామ్​లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవడం సరైనది కాదు. కెరీర్​ నాశనం అవుతుంది' అని చెప్పారు. 'కెరీర్​ పోతేనేం ప్రాణం పోదుగా..?. నేను సైఫ్​ను ప్రేమించాను. అతడితో జీవితం పంచకుంటాను' అని సమాధానమిచ్చాను. వివాహం చేసుకున్నాక కూడా మంచి సినిమాలు చేశాను. సైఫ్​ కూడా నన్ను బాగా ప్రోత్సాహించారు."

-కరీనా కపూర్​, బాలీవుడ్​ స్టార్ హీరోయిన్​.

ప్రస్తుతం ఆమిర్​ ఖాన్​ సరసన 'లాల్​ సింగ్​ చద్దా' సినిమాలో నటిస్తోంది కరీనా. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చూడండి సినీనటి తమన్నా ఇంట్లో కరోనా కలకలం

ABOUT THE AUTHOR

...view details