అల్లు అర్జున్ హీరోగా వచ్చిన 'అల వైకుంఠపురములో' సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో కీలక పాత్ర పోషించిన సుశాంత్‌కు మంచి పేరు లభించింది. దీంతో తన తర్వాతి చిత్రంపైనా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే తర్వాతి సినిమాను విడుదలకు సిద్ధం చేశాడు సుశాంత్. 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' అనే క్యాచీ టైటిల్‌తో వస్తున్న ఈ మూవీ సెన్సార్‌ను పూర్తి చేసుకుంది.
ఎస్ దర్శన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆగష్టు 27న రిలీజ్ చేయనున్నట్టు నిర్మాతలు తెలిపారు. దీనికి సెన్సార్ బృందం యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించగా.. ఏఐ స్టూడియోస్-శాస్త్ర మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి.