అల్లు అరవింద్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'రామాయణ'లో గ్రీకు దేవుడు రాముడిగా దర్శనమివ్వబోతున్నాడా? అంటే.. అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. కొత్తగా ఈ గ్రీకు దేవుడు ఎవరు అని అయోమయ పడకండి.. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్. 'దంగల్' ఫేం నితిష్ తివారి, 'మామ్' ఫేం రవి ఉద్యవార్ సంయుక్తంగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, నమిత్ మల్హోత్రా, మధు మంతెన సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమాతో రామాయణ ఇతిహాసాన్ని పూర్తి 3డీలో చూపించబోతున్నారు. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో మూడు భాగాలుగా రూపొందించనున్నారు. అందుకోసం అన్ని భాషల్లోనూ మంచి గుర్తింపు ఉన్న హృతిక్ రోషన్‌ను రాముడి పాత్ర కోసం ఎంపిక చేసుకుందట చిత్ర బృందం. ఇప్పటికే ఈ దిశగా చర్చలు కూడా షురూ చేసినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.